టాలీవుడ్ తో పాటు తమిళ, హిందీ భాషల్లో నటించిన రంభ వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. ఎనిమిదేళ్ళ క్రితం ఆమె కెనడాకి చెందిన వ్యాపారవేత్త ఇంతిరన్ ని వివాహం చేసుకుంది.  ఇటీవల బుల్లితెర రియాలిటీ షోలకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆమెకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

మూడోసారి గర్భం దాల్చిన ఆమెకి ఇప్పుడు కొడుకు పుట్టాడు. కెనడాలో టొరంటోలో ఉంటున్న రంభ సెప్టెంబర్ 23న మౌంట్ సినియ్ హాస్పిటల్ లో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు రంభ కొడుకు ఫోటోలు బయటకి రాలేదు. అయితే ఇటీవల తన భర్త, కూతుర్లు, కొడుకుతో హాస్పిటల్ లో తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి!