పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. రెండేళ్లకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్, కమ్ ప్రకటించిన తరువాత వస్తున్న బర్త్ డే కావడంతో పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నారు . అనేక సేవా కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో సందడి చేయనున్నారు. కాగా పవన్ నటిస్తున్న చిత్రాల నుండి దర్శక నిర్మాతలు క్రేజీ అప్డేట్స్ సిద్ధం చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న పవన్ 28వ చిత్రంపై అప్డేట్ ఇస్తున్నట్లు నిన్న ప్రకటన రావడం జరిగింది. 

అలాగే పవన్ కమ్ బ్యాక్ తరువాత మొదటిగా నటించిన వకీల్ సాబ్ మూవీపై కూడా ఆసక్తికర అప్డేట్ ఇస్తున్నట్లు నేడు దర్శక నిర్మాతలు తెలియజేశారు. మీ కోసం రేపు ఉదయం 9:09 నిమిషాలకు వకీల్ సాబ్ నుండి సంథింగ్ స్పెషల్ సర్ప్రైజ్ ఉందంటూ   తెలియజేశారు. పవన్ లాయర్ గా నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ నుండి రానున్న ఆ అప్డేట్ ఏమై ఉంటుందని ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. 

90 శాతం వరకు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాగా టీజర్ విడుదల ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐతే టీజర్ లేదని కేవలం మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేస్తున్నారంటూ మరో వార్త ప్రచారంలో ఉంది. ఏదైనా కానీ పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకొనేలా ఈ అప్డేట్ ఉంటుందని సమాచారం. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.