హాలీవుడ్ బిగ్ బడ్జెట్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫిల్మ్ ది లయన్ కింగ్ అనుకున్నట్టుగానే ఇండియాలో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ బయ్యర్స్ కి మంచి లాభాలనే అందించింది. 

గత నెల 19 భారతదేశ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది లయన్ కింగ్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.  ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లోనే 50కోట్ల వసూళ్లను అందుకున్న ఈ సినిమా 10 రోజుల్లో 100కోట్లను దాటింది. ఇక నాలుగవ వారానికి కూడా అదే ఫ్లోలో కలక్షన్స్ అందుకొని మొత్తంగా 24వ రోజుకి అన్ని భాషల్లో కలిపి 150కోట్లను దాటింది. 

రీసెంట్ గా శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ మద్దతుతో మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగులో నాని - బ్రహ్మానందం - అలీ - జగపతి బాబు - అరుంధతి రవి శంకర్ వంటి స్టార్స్ డబ్బింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా లయన్ కింగ్ మంచి వసూళ్లను రాబట్టి బయ్యర్లకు ప్రాఫిట్స్ ని అందించినట్లు సమాచారం.