ఒక చిన్న సినిమాతో పెద్ద విజయం దక్కించుకున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సారి వివేక్ తెరవబోయే ఫైల్స్ ఏంటో తెలుసా.. ?
ఒక చిన్న సినిమాతో పెద్ద విజయం దక్కించుకున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సారి వివేక్ తెరవబోయే ఫైల్స్ ఏంటో తెలుసా.. ?
ద కాశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. చరిత్ర సృష్టించిన సినిమా. పట్టుమని పదికోట్ల కూడా బడ్జెట్ పెట్టని సినిమా వందల కోట్లు సాధించింది. ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ అందరూ ప్రచారం చేసిన సినిమా.దాదాపు నెల రోజులు దేశాన్ని ఒక ఊపు ఊపిన సినిమా. ఈ సినిమా ప్రభంజనం తరువాత ఈ డైరెక్టర్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూశారు.
ద కశ్మీర్ ఫైల్స్ పేరిట కశ్మీర్‌లో పండిట్లపై చోటుచేసుకున్న అకృత్యాలపై సంచలన సినిమాను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
ద ఢిల్లీ ఫైల్స్ పేరిట తన నెక్ట్స్ మూవీని వివేక్ ప్రకటించారు. ద కశ్మీర్ ఫైల్స్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్... ద ఢిల్లీ ఫైల్స్ సినిమాతో ఇంకే రేంజిలో ఈ సినిమాను తెరకెక్కిస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. కశ్మీరీ పండిట్ల సమస్యలపై చిత్రం తీసిన వివేక్.. ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంలో ఇంకే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారోనన్న దానిపైనా అందరిలో కుతూహలం నెలకొంది.
అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా కథపై ఎటువంటి లీక్ చేయలేదు వివేక్. మరి డిల్లీలో డైరెక్టర్ వివేక్ ను ఆకర్షించిన ఆ అంశం ఏముందా అని బాలీవుడ్ లో చర్చస్టార్ట్ అయ్యింది. ఇక ఈసారి కూడా ప్రభుత్వ సపోర్ట్ తో.. సినిమాను సెన్సేషన్ చేస్తారా..? లేక ఇప్పుడు వచ్చిన సొంత ఇమేజ్ తో సినిమాను పరుగులు పెట్టిస్తారా చూడాలి మరి.
