Asianet News TeluguAsianet News Telugu

`ది కాశ్మీర్‌ ఫైల్స్` డైరెక్టర్‌ నెక్ట్స్.. `ది వ్యాక్సిన్‌ వార్‌`.. అఫీషియల్‌

`ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తన కొత్త సినిమాని ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ నేపథ్యంలో ఆయన సినిమాని తెరకెక్కించబోతున్నారు.

the kashmir file director next project the vaccine war announed
Author
First Published Nov 10, 2022, 12:00 PM IST

`ది కాశ్మీర్‌ ఫైల్స్` చిత్రంతో సంచలనం సృష్టించారు బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. ఈ సినిమా ఇటీవల విడుదలై ఇండియా వైడ్‌గా రికార్డులు క్రియేట్‌ చేసింది. నెమ్మదిగా తెలుగు, హిందీ విడుదలై దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. కాశ్మీర్‌ పండితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని బీజేపీ బాగా ప్రమోట్ చేసింది. కాశ్మీర్‌ అనే ఎమోషన్ ఈ సినిమాకి తిరుగులేని విజయాన్ని అందించింది. 

తాజాగా ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తన కొత్త సినిమాని ప్రకటించారు. మరో సంచలనాత్మక కథాంశంతో తన నెక్ట్స్ సినిమాని తీయబోతున్నట్టు తెలుస్తుంది. `ది వ్యాక్సిన్‌ వార్‌` పేరుతో తన కొత్త సినిమా తీయబోతున్నారు. ఈ విషయాన్ని కాసేపటి(గురువారం) క్రితమే ప్రకటించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఓ పోరాటం జరిగింది. అనేక దేశాలు ఇదిగో వ్యాక్సిన్‌, అదిగో వ్యాక్సిన్‌ అంటూ ప్రకటనలతో హోరెత్తించాయి. ఈ క్రమంలో ఇండియా వ్యాక్సిన్‌ని కనిపెట్టింది. దీని కోసం చేసిన పోరాటం నేపథ్యంలో ఆ కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ నేపథ్యంలో దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి సినిమా తీయబోతున్న నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇక `ది వ్యాక్సిన్‌ వార్‌`కి `మీకు తెలియని యుద్ధంతో పోరాడారు, గెలిచింది` అనే క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్ నిర్మాణంలో అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్ సమర్పణలో పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 11 ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. వాటిలో తెలుగుతోపాటు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ వంటి భాషలున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్‌. ఈ సినిమా సైంటిస్టుల విజయాన్ని, టీకా కోసం జరిగిన యుద్ధాన్ని, వారి అంకిత భావాన్ని తెలియజేస్తుందని నిర్మాతలు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios