Asianet News TeluguAsianet News Telugu

ఆర్ ఆర్ ఆర్ పై మనసు పారేసుకున్న హాలీవుడ్ హీరోయిన్... కలిసి పని చేస్తానంటూ కామెంట్స్ 


ఆర్ ఆర్ ఆర్ మూవీ తనకు తెగ నచ్చేసింది అంటుంది హాలీవుడ్ హీరోయిన్ అన్నే హతావే. ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో కలిసి పని చేయాలని ఉందన్న కోరిక బయటపెట్టింది. 
 

the idea of you movie heroine anne hathaway comments on rrr movie ksr
Author
First Published May 24, 2024, 4:13 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. అంతర్జాతీయంగా ఎక్కడో ఓ చోట ఆర్ ఆర్ ఆర్ పేరు వినిపిస్తోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ 2022 మార్చి 24న విడుదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. వంద రోజులకు పైగా జపాన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్ అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. 

ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీపడ్డ ఆర్ ఆర్ ఆర్ హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి ఆస్కార్ గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ కి గాను ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ పొందింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ ప్రశంసలు కురిపించారు. 

తాజాగా ఈ లిస్ట్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చేరింది. అన్నే హతావే తనకు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎంతగానో నచ్చినట్లు వెల్లడించారు. ఆమె నటించిన ది ఐడియా ఆఫ్ యు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడిన అన్నే హతావే ఆర్ ఆర్ ఆర్ మూవీపై ప్రశంసలు కురిపించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ నాకు చాలా నచ్చింది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో కలిసి పని చేయాలని ఉందని, ఆమె అన్నారు. 

అన్నే హతావే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అన్నే హతావే ది ప్రిన్సెస్ డైరీస్, నికోలస్ నిఖిల్బై, ఎల్లా ఎన్ హాంటెడ్, బ్రోక్ బ్యాక్ మౌంటైన్ వంటి చిత్రాలతో ఫేమ్ తెచ్చిపెట్టాయి. లేటెస్ట్ మూవీ ది ఐడియా యు ఆమె నటించి నిర్మించారు. ది ఐడియా ఆఫ్ యు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios