మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వివాదాలకు దారి తీసింది.

మన్మోహన్ సింగ్ నుండి గానీ, కాంగ్రెస్ పార్టీ నుండి గానీ ఈ సినిమాకు సంబదించి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. ఈ సినిమా ట్రైలర్ ని నిషేదించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు దాన్ని కొట్టివేసింది.

ఇప్పుడు ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. గతంలో మన్మోహన్ సింగ్ కి మీడియా సలాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. హిందీ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ ని కూడా జనవరి 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.