భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. 

ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక గ్రాండ్ గా ప్రారంభమైంది. సినీ లవర్స్ అంతాఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన సినీ సెలబ్రెటీలు, తారలతో పాటు, ఈ ఏడాది నామినేషన్ లో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ సంబరానికి హాజరయ్యారు. భారతీయ సినీ ప్రేక్షకుల కలను అడుగు దూరంలో నిలిపిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ ప్రదర్శన ఈ ఏడాది ఆస్కార్‌ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పటికే భారతీయ డాక్యుమెంటరీ షార్ట్‌ ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.

ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అంతే కాక మన RRR యూనిట్ లో చాలా మంది ఆస్కార్ వేడుకలకు హాజరు అయ్యారు.దాంతో ఆస్కార్ మనకు ఈ సారి మరింత స్పెషల్ అయ్యింది ఆస్కార్ కార్యక్రమం.దానికి తోడు ఆస్కార్ వేదికపై మన నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి. అవేమిటంటే...

Tell it Like A Woman సినిమా నుంచి applause సాంగ్ నామినేషన్స్ లో నిలిచింది. ఈ పాటకు సంగీతం, రచయిత రెండూ డయానా వారెన్ అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

టామ్ క్రూయిజ్ నటించిన Top Gun : Maveric సినిమా నుంచి Hold my Hand సాంగ్ నామినేట్ అవ్వగా ఈ పాటని పాప్ సింగర్ లేడీ గాగా, బ్లడ్ పాప్ ఇద్దరూ కలిసి రచించి సంగీతం అందించారు.

Black Panther : Wakanda forecer సినిమా నుంచి Lift me up సాంగ్ నామినేట్ అవ్వగా ఈ పాటని టెమ్స్, ర్యాన్ కూగ్లర్ కలిసి రాశారు. ఈ పాటకు సంగీతం టెమ్స్, రిహన్న, ర్యాన్ కూగ్లర్, లుడ్విగ్ గోరాన్సన్ అందించారు.

Everything Everywher all at Once సినిమా నుంచి This is a Life సాంగ్ నామినేట్ లో నిలవగా ఈ పాటని ర్యాన్ లాట్, డేవిడ్ బైర్నే కలిసి రాయగా ర్యాన్ లాట్, డేవిడ్ బైర్నే, మిట్స్కి కలిసి సంగీతం అందించారు.