Asianet News TeluguAsianet News Telugu

‘ఎన్బీకే107’కు ఆ టైటిల్ నే ఫిక్స్ చేశారంట.! అలాగైతే బాలయ్య ఫ్యాన్స్ కు అది బిగ్ సర్ ప్రైజే..

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎన్బీకే107’. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా చిత్ర  టైటిల్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. 
 

That title should have been fixed for NBK 107! If so, that is a big surprise for Balayya fans
Author
Hyderabad, First Published May 26, 2022, 5:35 PM IST

నందమూరి బాలకృష్ణ (Balakrishna) చివరి చిత్రం  `అఖండ` (Akhanda) తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పటికే 175 రోజులు థియేటర్లలో ఆడి రికార్డ్ క్రియేట్ చేసిందీ మాస్ యాక్షన్ ఫిల్మ్. ప్రస్తుతం బాలయ్య తన నెక్ట్స్ మూవీ ‘ఎన్బీకే107’లో నటిస్తున్నారు. ఈ మూవీకి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే  ‘ఎన్బీకే 107’పై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అందుకుతోడు బాలయ్య సెంటిమెంట్ హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే  సన్నివేశాలు ఈసినిమాలోనూ ఉండేలా చూస్తున్నారంట చిత్ర యూనిట్. దీంతో ఈ మూవీకూడా ‘అఖండ’లాగే భారీ హిట్ కొట్టనుందని భావిస్తున్నారు అభిమానులు.

ఇదిలా ఉంటే.. NBK107 టైటిల్ పై తాజాగా క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం టైటిల్ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య క్రేజ్ కు తగ్గట్టుగానే టైటిల్స్ ను ఎంచుకుంటారు. దీంతో ఎన్బీకే 107 ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘అన్నగారు, వేటపాలెం’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. తాజాగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. తన అభిమానుల నోటినుంచి వచ్చే పవర్ ఫుల్ వర్డ్ ‘జై బాలయ్య’ అనేదే టైటిల్ గా పెడితే బాగుటుందని మేకర్స్ ఆలోచనలో ఉన్నారంట. ఇలాగైతే నిజంగా ఈ సినిమా పూర్తిగా అభిమానుల కోసమే రూపుదిద్దుకుంటుందని చెప్పొచ్చు.  

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈసినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య ఆహార్యం కూడా చాలా కొత్తగా కనిపించడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) బాలయ్య సరసన ఆడిపాడనుంది. కన్నడ స్టార్ దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్  డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios