మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు సందర్బంగా ఆమె నటించిన బాలీవుడ్ క్వీన్ రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' టీజర్ వచ్చేసింది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ నటించిన ఈ కాన్సెప్ట్ క్లిక్ అయ్యింది.  100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న మొదటి ఇండియన్ లేడి ఓరియెంటెడ్ మూవీగా క్వీన్ నిలిచింది. ఇప్పుడు ఆ కథ మలయాళం - తమిళ్ అలాగే కన్నడలో రూపొందుతోంది. 

తెలుగు కథలో దట్ ఈజ్ మహాలక్ష్మి అంటూ తమన్నా రాబోతోంది. ఇక టీజర్ విషయానికి వస్తే.. దాదాపు హిందీ క్వీన్ ఛాయలు కనిపిస్తున్నప్పటికీ తమన్నా మాత్రం కొంచెం తన స్టైల్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ కామెడీ డ్రామా ఫిల్మ్ ను  ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరించారు. హనీమూన్ అంటూ సింగిల్ గా వరల్డ్ ట్రావెల్ చేసే ఒక రాజమండ్రి అమ్మాయి వివిధ రకాల మనుషూలను కలుసుకుంటుంది.

ఆ తరువాత ఆమె ఎదుర్కొన్న అనుభవాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట.  టీజర్ చూస్తుంటే తమన్నా ఈ సినిమాతో ఎదో సెన్సేషన్ ని క్రియేట్ చేసేలా ఉందనే టాక్ వస్తోంది. ఇక అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మను కుమారన్ నిర్మించారు. వచ్చే ఏడాది మొదట్లోనే సినిమా రిలీజ్ కానున్నట్లు టాక్.