దర్శకులు నటులుగా మారడం అనేది చాలా రేర్. ఏదో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ లో ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచే దర్శకుల కాలం వెళ్లిపోయింది. ఇప్పుడు ఫుల్ లెన్త్ లో సినిమా మొత్తంలో మెప్పించే దర్శకులు ఎక్కువవుతున్నారు. అదే తరహాలో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ సిద్దమైన సంగతి తెలిసిందే. 

పెళ్లి చూపులు - ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ మొన్న ఫలక్ నుమా దాస్ లో పోలీస్ పాత్రలో కనిపించి మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. 

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మించనున్న మీకు మాత్రమే చెప్తా సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే తరుణ్ యాక్టర్ అవ్వాలని అస్సలు అనుకోలేదట. 

కానీ చిన్న తనంలో తన తల్లి రాసిన ఒక నోట్ ఇప్పుడు అనుకోని విధంగా నిజమైందని చెబుతున్నాడు. 'నా చిన్నతనంలో నేను నటుడిని అవ్వాలని మా అమ్మ ఒక నోట్ రాసుకుంది. రీసెంట్ గా నాకు దాన్ని చూపించడంతో బహుసహా అందుకే నేను యాక్టర్ ని అవుతున్నా'  అని తరుణ్ వివరణ ఇచ్చాడు. 

అయితే యాక్టర్ గా తానని ఆడియెన్స్ ఒప్పుకోకపోతే యధావిధిగా తన డైరక్షన్ - ఎడిటింగ్ వర్క్ తో బిజీ అయిపోతానని తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చాడు. మరి తరుణ్ నటుడిగా ఎంతవరకు క్లిక్ అవుతాడో చూడాలి