Asianet News TeluguAsianet News Telugu

నానా.. నీకు నిజం చెప్పే దమ్ముందా?. తను శ్రీ కామెంట్స్

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ - నేషనల్ అవార్డ్ విన్నర్ నానా పటేకర్ గురించి గత కొన్ని రోజులుగా వివాదస్పద వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తనని పదేళ్ల క్రితం ఒక షూటింగ్ లో లైంగికంగా వేధించాడని మాజీ హీరోయిన్ తను శ్రీ దత్తా వివరించింది. ఆమె రోజు ఈ విషయంపై ఎదో ఒక కామెంట్ చేస్తుండడంతో న్యూస్ మరింత వైరల్ గా మారింది. 

 

thanu sri dattha comments on nana patekar
Author
Hyderabad, First Published Oct 7, 2018, 11:57 AM IST

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ - నేషనల్ అవార్డ్ విన్నర్ నానా పటేకర్ గురించి గత కొన్ని రోజులుగా వివాదస్పద వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తనని పదేళ్ల క్రితం ఒక షూటింగ్ లో లైంగికంగా వేధించాడని మాజీ హీరోయిన్ తను శ్రీ దత్తా వివరించింది. ఆమె రోజు ఈ విషయంపై ఎదో ఒక కామెంట్ చేస్తుండడంతో న్యూస్ మరింత వైరల్ గా మారింది. 

కొందరు తను శ్రీకి మద్దతు నిలువగా మరికొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఇక గతంలోనే ఈ విషయాన్నీ బయటకు చెప్పకుండా పదేళ్ల తరువాత చెప్పడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. ఈ విషయంపై తను శ్రీ దత్తా వివరణ ఇచ్చారు. ముందుగా నాకు మద్దతు పలుకుతున్న వారికి కృతజ్ఞతలు. గతంలోనే  ఈ విషయాన్నీ ఎందుకు చెప్పలేదని చాలా మంది అడుగుతున్నారు. అప్పట్లో నాకు ఎవరు మద్దతు ఇవ్వలేదు. తెలిసిన వారు కూడా ఘటనపై స్పందించలేదు. అందుకే చెప్పలేదు. 

ఇక నానా పటేకర్ నా ముందుకు వచ్చి కళ్ళలోకి చూస్తూ నిజం మాట్లాడే దమ్ముందా అని హెచ్చరించారు. అదే విధంగా ఆయన అడిగిన ప్రశ్నలకు ముందు నిలుచొని సమాధానం చెబుతాను. అయనకు అలాంటి దమ్ముందా? అని ప్రశ్నిస్తూ.. నానా లీగల్ గా ఎదుర్కోవడానికి సిద్దమైనప్పటికీ వాటిని గురించి ఆమె తేలిగ్గా తీసుకున్నట్లు అర్ధమవుతోంది. లీగల్ నోటీసులకు ఎలాంటి సమాధానం ఎలా ఇవ్వాలో నాకు తెలుసని తను శ్రీ వివరణ ఇచ్చింది.   

Follow Us:
Download App:
  • android
  • ios