టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు రెండు సినిమాలపై ఎక్కువగా ఉందని  చెప్పవచ్చు. ఒకటి సైరా - మరోటి సాహో. సాహో సంగతి పక్కనపెడితే మెగాస్టార్ కెరీర్ లో మొదటి సారి నటిస్తున్న హిస్టారికల్ బయోపిక్ పై ఆడియెన్స్ భారీ అంచనాలను పెంచుకున్నారు. 

టీజర్ తో సినిమాపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ అసలు యాక్షన్ సీన్స్.. ఎమోషనల్ సీన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఎవరి ఊహలకు అందడం లేదు. పైగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మరణాన్ని దర్శకుడు ఎలా చూపిస్తాడు? మెగాస్టార్ అప్పుడు ఎలా కనిపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. అయితే చిత్ర యూనిట్ ఇంతవరకు సినిమా విజన్ గురించి బయటపెట్టలేదు. 

కానీ మొదటిసారి నటుడు తనికెళ్ళ భరణి సినిమాపై కామెంట్స్ చేస్తూ మంచి కిక్కిచ్చాడు. సైరా సినిమా తెలుగువాళ్లందరు గర్వపడేలా చేస్తుందని తెలుగు ఖ్యాతిని పెంచుతుందని అన్నారు. మెగా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమా సిద్ధమవుతోందని కష్టే ఫలి.. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది కావున సినిమా ఆలస్యమవుతున్నందుకు చింతించవద్దని అన్నారు. 

రీసెంట్ గా తిరుపతికి వెళ్లిన భరణి మీడియాకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు,. సైరా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని చెబుతూ తన పాత్ర సినిమాలో అద్భుతంగా ఉంటుందని అన్నారు. అలాగే తాను దర్శకత్వం  వహించబోయే సినిమా ఆగస్ట్ లో మొదలవుతుందని వివరించారు.