టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ లో ఒకటిగా నిలిచిన అర్జున్ రెడ్డి ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే వెనక ముందు ఆలోచించకుండా పక్క ఇండస్ట్రీల వారు సినిమా కథను కొనేసుకున్నారు. కొంటే కొన్నారు గాని సినిమాను ఏ విధంగా తెరకెక్కించాలి అనే పట్టు దొరక్క నానా తంటాలు పడుతున్నారు. 

అర్జున్ రెడ్డిలో కథ కన్నా కథనం గొప్పది. మేకింగ్ స్టైల్ లోనే సినిమా అసలు సంగతి ఏంటో తెలుస్తుంది. అందుకే బాలీవుడ్ షాహిద్ కపూర్ ఒరిజినల్ దర్శకుడిని హిందీ రీమేక్ కు సెట్ చేసుకున్నాడు. కానీ కోలీవుడ్ దర్శకుడు బాలా మాత్రం సగం షూటింగ్ అయిపోకముందే వర్మ సినిమాకు డైరెక్షన్ చేయలేనని చేతులెత్తేశాడు. విక్రమ్ తనయుడు ధృవ్ కు కథ ఎంతవరకు సెట్ అవుతుంది అనేది ఇంకా డౌట్ గానే ఉంది. 

ఇక ఫైనల్ గా కొడుకు కెరీర్ కోసం రిస్క్ చేయకూడదని విక్రమ్ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ చేశాడు. అర్జున్ రెడ్డి ఒరిజినల్ దర్శకుడైన్ సందీప్ రెడ్డి శిష్యుడు గిరీశయ్యకు సినిమా బాధ్యతలను అప్పగించాడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డికి సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవం ఉండడంతో అతనే బెస్ట్ ఆప్షన్ అని నిర్ణయించుకున్నారట. 

ఇక మొదటి నుంచి మళ్ళీ అర్జున్ రెడ్డి షూటింగ్ ను మొదలెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలా డైరెక్షన్ లో చేసిన కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ విక్రమ్ వాటిని ఏ మాత్రం టచ్ చేయకూడదని మళ్ళీ ఫ్రెష్ గా ఈ కథను షూట్ చెయ్యాలని చిత్ర యూనిట్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ బణిత సందును వర్మ సినిమాలో కథానాయికగా సెలెక్ట్ చేశారు.