రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా సాంగ్స్.. థియేటర్ దద్దరిల్లేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినా.. తమన్ పై ట్రోలింగ్స్ ఆగడం లేదు. ఇక తమన్ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా వారికి కౌంటర్ ఇస్తున్నాడు.
వరుసగా సినిమాలు తన ఖాతాలో వేసుకుంటూ.. మ్యూజియ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు తమన్. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాధేశ్యామ్ ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చ్ 11) రిలీజ్ అయ్యింది. జిల్ పేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కు తమన్ బీజియం అందించారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటింన ఈ పీరియాడికల్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
రాధ్యేశ్యామ్ సూపర్ డూపర్ అంటూ కొంత మంది పొగుడుతుంటే.. మరికొంత మంది మాత్రం బాగా స్లోగా సినిమా సాగుతుంది అంటూ కొందరు.. బోర్ కొట్టిందని కొందరు.. ఈ ప్రేమ అజరామరం అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే ఈ సినిమా ప్రభాస్ చేసి ఉండాల్సింది కాదు అంటూ నెగెటీవ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కామెంట్ల పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు. అయితే ఈ నెగెటీవ్ కామెంట్ల పై తమన్ ఇన్ డైరెక్ట్ గా స్పందించారు.
సినిమా స్లోగా ఉందన్న వాళ్లకు కౌంటర్ ఇచ్చేలా ఉన్న మీమ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు తమన్. సినిమా ఎలా ఉంది అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉంది అని చెప్పగా.. నేను అడిగింది బాగుందా అని మాత్రమే.. లవ్ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నైట్.. సెకండ్ హాఫ్ లో సెకండ్ సెటప్ పెట్టి తీయ్యాలా..? అంటూ స్టాంగ్ కౌంటర్ ఇచ్చేలా ఉంది మీమ్.
ఈ మీమ్ ను శేర్ చేసిన తమన్ మీమ్ అదిరింది అంటే కామెంట్ పెట్టాడు. దానితో పాటు సినిమా స్లో అంట... నువ్వు పరిగెత్తాల్సింది అంటూ ట్రోలర్స్‌పై సెటైర్ కూడా వేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ ట్వీట్‌కు బ్లాక్‌బస్టర్ రాధేశ్యామ్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఆడ్ చేశాడు. తమన్ కౌంటర్ కు కొంతమంది ప్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.