Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబు AMB థియేటర్ లో థళపతి విజయ్, ఏం సినిమా చూశారో తెలుసా...?

తమిళ స్టార్ హీరో  విజయ్ దళపతి  హైదరాబాద్ లో సందడి చేశారు. తెలుగులో రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో పెట్టిన విజయ్.. ఈ మధ్య ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు కు సంబంధించిన ఏఎమ్బీ మాల్ లో ఆయన సినిమా చూశారు. ఇంతకీ విజయ్ ఏం సినిమా చూశారు.  

thalapathy Vijay Watches Movie in Hyderabad AMB Mall
Author
Hyderabad, First Published Aug 17, 2022, 9:28 AM IST

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు దళపతి విజయ్. ఆయన ఈ మధ్య ఎక్కువగా హైదరబాద్ లో సందడి చేస్తున్నారు. ఎక్కువగా ఇక్కడే ఉంటున్నారు. అంతే కాదు హైదరాబాద్ లో ప్రముఖులను కలుస్తూ.. ప్రముఖ ప్రదేశాలు చూస్తూ.. తన షూటింగ్స్ చేసుకుంటూ విజయ్ హైదరాబాద్ ను తన సొంత ప్రాంతంగా అలవాటు చేసుకుంటున్నాడు. ఇక కొన్ని సినిమాలు తప్పించి విజయ్ నటించిన తమళ డబ్బింగ్ సినిమాలన్నీ తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా డైరెక్ట్ తెలుగు సినిమా కూడా స్టార్ట్ చేశాడు విజయ్. 

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో  తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌  నటిస్తున్న సినిమా  వారసుడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ..నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత,  లాంటి స్టార్స్ ఇతర పాత్రల్లో నటిస్తు న్న ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ ల జరుగుతోంది. ఈసినిమాకు తమన్ స్వారాలు సమకూర్చుతున్నారు.   వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ.. సూపర్ ఫాస్ట్ గాఈమూవీని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు టీమ్. షూటింగ్ లో స్టార్స్ అంతా బిజీ బిజీగా ఉన్నారు. అటు విజయ్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు. 

 

ఈ షూటింగ్ బ్రేక్ టైమ్ లో విజయ్ దళపతి మహేష్ బాబకు చెందిన ఏఎమ్బీ మాల్ ను సందర్శించారు.  విరామంలో భాగంగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన రీసెంట్ మూవీ బింబిసారను   విజయ్‌  చూసినట్టు తెలుస్తోంది. సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఆగస్టు 15న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు థియేటర్‌ ఏఎమ్‌బీలో చూసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతోంది. 

 

ఈ వీడియోలో విజయ్‌ బ్లూ షర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌  లో ముఖానికి మాస్క్‌ పెట్టుకుని కనిపించాడు. మాస్క్ లో ఉన్న విజయ్‌ను  గుర్తు పట్టిన ఫొటోగ్రాఫర్స్‌ వెంటనే తమ కెమెరాలకు పని పెట్టారు. వరుసగా ఫోటోలను  క్లిక్‌మనిపించారు. ఇక అభిమానుల తాకిడి పెరుగుతంది అనుకున్నాడో ఏమో కాని విజయ్  కారులో వెళ్తుండగా.. ఆయన  హీరో డ్రైవర్‌ విజయ్ కనిపించకుండా కవర్ చేసు ప్రయత్నంచేశాడు.  ఇక ప్రస్తుతం విజయ్ మహేష్ బాబు థియేటర్ కు రావడం.. నందమూరి హీరో కల్యాణ్ రామ్ సినిమా బింబిసారను చూడటం చర్చనీయాంశం అవుతోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios