Asianet News TeluguAsianet News Telugu

కన్నతండ్రిపై హీరో విజయ్ లీగల్ యాక్షన్... పేరు వాడకూడదంటూ నోటీసులు!

2020 జులైలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ అఖిల భారత దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం పేరుతో ఓ రాజకీయ పార్టీ రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీ తరపున రానున్న ఎన్నికలలో విజయ్ బరిలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. 
 

thalapathy vijay sent legal notices to his father chandra shekar ksr
Author
Hyderabad, First Published Jan 27, 2021, 4:11 PM IST

స్టార్ హీరో విజయ్ తన తండ్రి చంద్రశేఖర్ కి లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ తన న్యాయవాది కుమరేషన్ ద్వారా తండ్రికి నోటీసులు పంపినట్లు సమాచారం. ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై తండ్రీ కొడుకుల మధ్య వివాదం నడుస్తుంది.  2020 జులైలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ అఖిల భారత దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం పేరుతో ఓ రాజకీయ పార్టీ రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీ తరపున రానున్న ఎన్నికలలో విజయ్ బరిలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. 

చంద్రశేఖర్ చర్యలకు ఆగ్రహానికి గురైన విజయ్... ఆపార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని, ఇప్పట్లో రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాగే తన అభిమానులెవరు ఆ పార్టీ పేరున రాజకీయ కార్యక్రమాలలో పాల్గొన వద్దని సూచించడం జరిగింది. ఇక తాజా నోటీసులలో తన తండ్రి ఏ విధంగానూ ఆ పార్టీ ప్రచారం కోసం తన పేరు కానీ, ఫోటో కానీ ఉపయోగించరాదని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారట. 

కోలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్న విజయ్ కుటుంబంలో ఏర్పడిన ఈ అంతర్గత కలహాలు అభిమానులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.  ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొందరు అభిమానులు రాజకీయ ప్రవేశం చేయాలని తమ హీరోలను కోరుతున్నారు. రజినీకాంత్ , విజయ్ వంటి హీరోల ఫ్యాన్స్ నుండి ఈ డిమాండ్ మరింతగా వినిపిస్తుంది. రజినీకాంత్ ఆరోగ్య కారణాల రీత్యా పాలిటిక్స్ వద్దనుకుంటున్నట్లు ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios