Asianet News TeluguAsianet News Telugu

విజయ్ పొలిటికల్ ఎంట్రీ పక్కా..? గ్రౌండ్ లెవల్లో పనిచేస్తున్న దళపతి..

పైకి ఏమీ లేదు అని చెపుతున్నా.. దళపతి విజయ్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. హీరోగా స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. చాపకింద నీరులా  పనులు చేసుకుంటూ పోతున్నాడు. 

Thalapathy Vijay Political Entry Plans in Tamilnadu
Author
First Published Aug 27, 2022, 6:53 AM IST

తమిళ స్టార్ హీరో.. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్దం చేసుకుంటున్నాడు. పైకి ఏమీ లేదు అని చెపుతున్నా.. లోలోపన మాత్రం అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నాడు. నటుడు విజయ్‌ రాజకీయ రంగప్రవేశం తథ్యం అనిపిస్తోంది. చాలాకాలం క్రితమే ఈయన రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కూడా విజయ్‌ అభిమానులతో సమావేశాలు నిర్వహించి మరింత జోష్‌ తెచ్చారు. కానీ ఎందుకో వెనకడుకు వేశారు. 
విజయ్  రాజకీయ ఆరంగేట్రం పై చాలా కాలంగా డిస్కర్షన్ నడుస్తోంది. తమిళనాట కోట్లాది ఫ్యాన్స్ ను కలిగిఉన్న స్టార్ హీరో.. తమిళ రాజకీయల్లో చక్రంతిప్పుతారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఎం. చంద్రశేఖర్‌ విజయ్‌  మక్కల్‌ ఇయక్కం అంటూ  రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టారు కూడా.. ప్రస్తుతం  స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న  విజయ్‌ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. మరోపక్క అభిమానుల.. ప్రజలు ఇబ్బంది పడుతున్నవారి  అవసరాలను చూసుకుంటూ.. వాటిని  పూర్తి చేయాలని ఆదేశించారట. దీంతో విజయ్‌ మక్కళ్‌ ఇయక్కమ్‌ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. 

 


విజయ్ డైరెక్ట్ ఎంట్రీకి టైమ్ ఉండటంతో.. ఇలా ముందే ఆ వాతవరణాన్ని క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన టీమ్ ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నాడట విజయ్. తనఫ్యాన్ బేస్ చేస్తున్న పనులకు విజయ్ కుఇమేజ్ పెరుగుతుంది. అంతే కాదు గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు విజయ్ కు తెలుస్తుంది. అందుకే తన టీమ్ తో .. ఎప్పటికప్పుడు చర్చిస్తూ.. పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడట విజయ్. 

విజయ్ గతంలోనే పొలిటికల్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు. కాని అది బయటకు తెలియనీయలేదు అని టాక్. లోకల్ ఎలక్షన్స్ తో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించారు కూడా. ఈ విషయంలోనే విజయ్  తండ్రికి..  విజయ్ కు  మధ్య విభేదాలు  కూడా వచ్చాయి. ఆ పార్టీతో తనకు సంబంధం లేదంటూ.. విజయ్ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చాడు. పోలీస్ కేస్ కూడా పెట్టాడు. కాని పోటీ చేసి గెలిచిన తన ఫ్యాన్స్ కు మాత్రం శుభాకాంక్షలు తెలిపారు. 

అంతే కాదు విజయ్ ఆమధ్య  రాజకీయ హ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను హైదరాబాద్ లో రహస్యంగా కలిశారని.. తన రాజకీయ ఆరంగేట్రం గురించే చర్చ జరిగినట్టు టాక్ గట్టిగా నడిచింది. దాంతో  దళపతి సీక్రేట్ గా తన పొలిటికల్ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నట్టు తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయి. రాజకీయాల్లోకి వస్తానని రజనీ కాంత్ ఆగిపోవడం విజయ్ కు కలిసొచ్చే అంశం గా మారనుంది. కమల్ హాసన్ కూడా తన పార్టీపై పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టడంలేదని అంతా అనుకుంటున్నారు. దాంతో టైమ్ చూసుకుని విజయ్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.  

 

ప్రస్తుతం విజయ్ దళపతి తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వారసుడు మూవీ చేస్తున్నాడు విజయ్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమా తరువాత విజయ్ మరొ తెలుగు డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios