ఫ్యాన్స్ కు దళపతి విజయ్ యాక్షన్ ట్రీట్, లియో మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్
ఫ్యాన్స్ కు యాక్షన్ సీక్వెన్స్ లతో విజ్యువల్ ట్రీట్ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా లియో.. ఈమూవీ నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఫ్యాన్స్ కు యాక్షన్ సీక్వెన్స్ లతో విజ్యువల్ ట్రీట్ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా లియో.. ఈమూవీ నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తమిళంతో పాటు.. తెలుగులో కూడా స్టార్ హీరోగా పేరు సంపాదించాడు దళపతి విజయ్. సౌత్ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ నుంచి తాజాగా రాబోతున్న సినిమా లియో. ఇక ఈ మూవీ నుంచి ఫ్రెష్ గా లియో ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒక్క సారిగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఇక రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం విశేషం.
అంతే కాదు ఈ ట్రైలర్ కు సబంధించిన రియల్ టైమ్ వ్యూస్ 5 మిలియన్లు దాటాయని సన్ టీవీ తెలిపింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో విజయ్ యాక్షన్ సీన్స్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తేనే సనిమాపై అంచనాలు తెలుస్తున్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈసినిమా గ్యాంగ్ స్టర్ కథతో రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో పాటు గౌతమ్ మీనన్, మిస్కిన్ నటిస్తున్నారు. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కాంబోలో రూపుదిద్దుకున్న రెండో సినిమా ఇది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ సినిమా చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.