ధళపతి విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన `బీస్ట్` చిత్రం ఇటీవల విడుదలై థియేటర్‌లో రన్‌ అవుతుంది.డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యిందట. 

ఇళయ దళపతి విజయ్‌(Vijay) నటించిన లేటెస్ట్ మూవీ `బీస్ట్`(Beast). బుధవారం (ఏప్రిల్‌ 13)న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంటుంది. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటించిన ఈ చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీగా విడుదలైంది. విజయ్‌కి ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్‌ ఉంది. దీంతో సౌత్‌ భాషలతోపాటు హిందీ, ఓవర్సీస్‌లోనూ రిలీజ్‌ చేశారు. 

అయితే ప్రారంభం నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. తమిళంలో ఓకేగానీ, తెలుగుతోపాటు హిందీ, ఇతర భాషల్లో మాత్రం పూర్తి డివైడ్‌ టాక్‌ వస్తుంది. ముక్తకంఠంతో దీన్ని ఫ్లాప్‌ సినిమాగా చెబుతున్నారు నెటిజన్లు. అయితే తమిళంలో మాత్రం కలెక్షన్ల పరంగా ఫర్వాలేదు. విజయ్‌కి తమిళనాట భారీ ఫాలోయింగ్‌ ఉంది. .దీంతో ఇప్పటికే సినిమా వంద కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసినట్టు సమాచారం. అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చింది. ఓటీటీలో వచ్చే డేట్‌ ఫిక్స్(Beast Ott Date) అయినట్టు సమాచారం. ఈ చిత్ర ఓటీటీ హక్కులను సన్‌ నెక్ట్స్, నెట్‌ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. సినిమా విడుదలైన 28 రోజులకు ఓటీటీలో దీన్ని స్ట్రీమింగ్‌ చేయబోతున్నారట. అంటే మే 11న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, సన్‌ నెక్ట్స్ ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు. థియేటర్‌లో పెద్దగా సక్సెస్‌ కానీ ఈ చిత్రం మరి ఓటీటీలో ఆకట్టుకుంటుందేమో చూడాలి. 

షాపింగ్‌ మాల్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. చెన్నైలోని నడిబొడ్డున్న ఉన్న షాపింగ్‌ మాల్‌ని టెర్రరిస్ట్ లు హైజాక్‌ చేస్తారు. అందులో రా ఏజెంట్‌ అయిన వీర రాఘవన్‌ ఉంటారు. ఆయన టెర్రరిస్ట్ లను ఎదుర్కొని, షాపింగ్‌ మాల్‌ని, అందులో ఉన్న 150 మంది ప్రజలను ఎలా రక్షించాడనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇదిలా ఉంటే విజయ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తన 66వ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది.