Asianet News TeluguAsianet News Telugu

శ్రీలీలకు పెద్ద పరీక్షే,ఏం జరుగుతుందో

 “స్కంద” చిత్రం సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత “భగవంత్ కేసరి” లో బాలయ్యకు కూతురుగా కనిపించింది. 

Test for Sreeleela with Extra Ordinary Man jsp
Author
First Published Dec 7, 2023, 12:21 PM IST


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల తెలుగులో సెటిలైపోయిందనే చెప్పాలి. ఈ  ఒకే ఒక సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఆ తర్వాత  గతేడాది చివర్లో రవితేజతో చేసిన ‘ధమాకా’ మూవీతో అదిరిపోయే సక్సెస్ ని సొంతం చేసుకొని టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది. ఈ సినిమా సక్సెస్‌తో శ్రీలీల వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌‌కు ఓకె చెప్పింది. దాంతో అప్పటికే స్టార్స్ గా హీరోయిన్స్ ని ప్రక్కన పెట్టి నెంబర్ వన్ ప్లేస్ కు వెళ్లింది. 

అయితే అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న టైమ్ లో  వరుస ఫ్లాపులు ఆమెను స్లో చేశాయి. 2023 సంవత్సరం ఆమెకు కష్టంగా మారింది. రామ్ హీరోగా   బోయపాటి దర్శకత్వం లో వచ్చిన “స్కంద” చిత్రం సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత “భగవంత్ కేసరి” లో బాలయ్యకు కూతురుగా కనిపించింది. ఆ సినిమా సక్సెస్ అయ్యింది.. ఆమె నటనా సామర్థ్యాలకు కూడా ప్రశంసలు అందుకుంది. అయినా గ్లామర్ అప్పీల్ లేకపోవటంతో కెరీర్ పరంగా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ సరసన చేసిన ఆదికేశవ చిత్రం సైతం డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాకూడా ఆమె కెరీర్ కు పెద్ద మైనస్ గా మారింది. 

ఈ క్రమంలో ఇప్పుడు ఆమె  “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్”సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది.  ఆమె నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.   “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” డిసెంబర్ 8, 2023న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా హిట్టైతే ఈ సంవత్సరతం బాలెన్స్ అయ్యి మళ్లీ జనవరిలో గుంటూరు కారంతో పలకరించవచ్చు. కాబట్టి ఇది ఆమెకు మళ్లీ పెద్ద పరీక్ష.

నితిన్ - శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్' సినిమా రూపొందింది. నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో నితిన్ మాట్లాడుతూ, "శ్రీలీల మంచి డాన్సర్ అని నాకు తెలుసు. ఆమెకి భరతనాట్యం తెలుసు .. కూచిపూడి తెలుసు .. మంచి హాకీ ప్లేయర్ .. స్విమ్మింగ్ లో రికార్డు ఉంది .. వీణ వాయించడంలో మంచి ప్రవేశం ఉంది .. త్వరలో మెడిసిన్ పూర్తి చేయబోతోందనే విషయం తక్కువ మందికి తెలుసు. అందువలన నా దృష్టిలో తను ఎక్స్ట్రా ర్డినరీ ఉమెన్' అన్నాడు. ఈ నెల 8న తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు" అని చెప్పాడు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios