Asianet News TeluguAsianet News Telugu

‘కాలుడు’గా పవన్ కళ్యాణ్...ఇదే ఫైనల్ చేసేస్తారా?

 ఈ చిత్రం #PKSDT కోసం ఇప్పటికే మూడు టైటిల్స్ ని పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట. టైటిల్ ని వచ్చే వారం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట.

Tentative title plan for Pawan Kalyan, Sai Dharam Tejs  film
Author
First Published Apr 29, 2023, 7:54 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన వాటిలో సముద్రఖని డైరక్షన్ లో చేస్తోన్న సినిమా ఒకటి. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఆడిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వినోదయసిత్తం అనే సినిమాకు ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ టైటిల్ పై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను కన్ఫామ్ చేసారని టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది. కానీ ఈ టైటిల్ వద్దనుకున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో ‘కాలుడు’గా #PawanKalyan, ’మార్కండేయ’ గా #SaiDharamTej కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం #PKSDT కోసం ఇప్పటికే మూడు టైటిల్స్ ని పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట. టైటిల్ ని వచ్చే వారం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ మూవీకి కింగ్ నాగార్జున సూపర్ హిట్ సాంగ్ టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ మూవీకి ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.  ఒక సామాన్యుడి కోసం దేవుడు దిగివస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారు. మరో ప్రక్క కాలుడు అనే టైటిల్ ని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉందిట.
 
మరో ప్రక్క ఆగస్ట్ 15 లేదా ఆగస్ట్ 25 న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలైలోగా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాల‌ని టార్గెట్‌ సెట్ చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఆ మేరకు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. అయితే అఫీషియల్ గా ఈ మేరకు ప్రకటన చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.  ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ారు. గోపాల గోపాల తర్వాత పవన్ దేవుడుగా కనిపిస్తున్న చిత్రం ఇదే. 

ఈ ఫాంట‌సీ డ్రామా సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేవ‌లం 20 రోజులు మాత్ర‌మే డేట్స్ కేటాయించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అనుకోకుండా ప్ర‌మాదంలో క‌న్నుమూసిన ఓ వ్య‌క్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో ఈ రీమేక్ క‌థ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రీమేక్‌కు దేవ‌ర‌, దేవుడు అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌ల‌తో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వినోధ‌య సీత‌మ్ రీమేక్‌కు అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాష‌ణ‌ల‌ను అందించ‌బోతున్నారు. 

 ఒరిజినల్ వెర్షన్‌లో ఎలాంటి పాటలు లేవు కానీ తెలుగు స్క్రిప్ట్‌ను పూర్తిగా మారుస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పేసేలా ఓ మాస్ మసాలా నెంబర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.  తెలుగు వర్షన్ రీమేక్ కి కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా.. మాటలు అందిస్తూ తెర వెనుక అన్నీ తానై చూసుకోబోతున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios