కృష్ణ మరణానికి సంతాప సూచకంగా తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయంతీసుకుంది. రేపు షూటింగ్‌లు బంద్‌కి పిలుపినిచ్చింది.
తెలుగు తెర దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లెజెండరీ నటుడు కన్నుమూయడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం తెలుగు సినీ ప్రముఖులే కాదు, ఇండియన్ సినిమాకి చెందిన ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కిది ఓ చీకటి రోజుగా వర్ణిస్తున్న నేపథ్యంలో కృష్ణకి సంతాప సూచకంగా తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయంతీసుకుంది. రేపు షూటింగ్‌లు బంద్‌కి పిలుపినించింది.
ఇదిలా ఉంటే కృష్ణ భౌతిక కాయానికి మొదట ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. రమేష్‌బాబు విదేశాల నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన రావడం ఆలస్యమవుతుందనే కారణంతో ఎల్లుండి(గురువారం) అంత్యక్రియలు చేయాలని మొదట అనుకున్నారట. కానీ రేపటి మధ్యాహ్నం వరకు మనవడు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు(బుధవారం) సాయంత్రం నిర్వహించాలనుకుంటున్నారు.
కృష్ణ భౌతికకాయం ఇప్పుడు ఆయన నివాసం నానక్‌రామాగూడలో ఉంది. కాసేపట్లో ఆయన బాడీని గౌచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. అక్కడ అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఈ రోజు సాయంత్రం నుంచి రేపు 2గంటల వరకు ఉంచనున్నారు. కృష్ణ లక్షలాది మంది అభిమానులున్న నేపథ్యంలో వారంతా ఆయన్ని కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారని తెలుస్తుంది. అందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. అభిమానుల సందర్శన అనంతరం సాయంత్రం మూడు, నాలుగు గంటల సమయంలో ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో కృష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి చేయయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. రేపే కృష్ణ అంత్యక్రియలు చేయనున్న నేపథ్యంలో రేపే షూటింగ్‌లకు బంద్‌కి పిలుపునిస్తూ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరోవైపు ఏపీలోనూ రేపు మార్నింగ్ షోలను రద్దు చేస్తూ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడం విశేషం.
