సినిమా ప్రేమికులు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వేసవి కోసం. వేసవి సెలవుల కోసం అనుకుంటున్నారా? కాదండీ బాబు రాబోయే సినిమాల కోసం. మహేష్ బాబు నుండి నాని వరకు చాలా మంది స్టార్ హీరోలు మన ముందుకు వచ్చేయబోతున్నారు. మరి ముందు ఎవరు వస్తున్నారు తర్వాత ఎవరు వస్తున్నారు చూసేద్దామా..

అందరికంటే ముందు యంగ్ హీరో నిఖిల్ 'కిరాక్ పార్టీ' తో మార్చ్ 16న రాబోతున్నాడు. అదే టైటిల్ తో వచ్చిన హిట్ కన్నడ సినిమా రీమేక్ అది. తర్వాత కళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ గా మార్చ్ 23న వచ్చేస్తున్నాడు. అది పొలిటికల్ బాక్ డ్రాప్ సినిమా నే అయినా ఎంటర్టైన్మెంట్ లో ఏ డోకా రానివ్వడాని తెలుస్తుంది. నెలాఖరున మార్చ్ 30 న మన రామ్ చరణ్ రంగస్థలం తో మనల్ని మైమరపించబోతున్నాడు. ఇప్పటికే టీజర్ తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిపోయారు ఈ మెగా హీరో మరియు సమంత.

సినిమాల్లో తెరపై పెద్దగా కనిపించకపోయినా ప్రొడక్షన్ ద్వారా అయినా ఫాన్స్ తో దగ్గరగా ఉండబోతున్న పవన్ కళ్యాణ్. ఎందుకంటే నితిన్ హీరోగా ఆయన నిర్మిస్తున్న చల్ మోహన రంగ ఏప్రిల్ 5న రాబోతోంది. లై లో నితిన్ పక్కన నటించిన మేఘ ఆకాష్ ఏ ఇందులో కూడా హీరోయిన్. గతేడాది హాట్ట్రిక్ కొట్టిన నాచురల్ స్టార్ నాని ఏప్రిల్ 13 న విడుదల కాబోతున్న కృష్ణార్జున యుద్ధం తో తన విన్నింగ్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా మొదటి సారిగా కనిపించబోతున్న భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20 న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ నెల ను కూడా సూపర్ హిట్ తో ముగించడానికి - ధనుష్ నిర్మించిన కాలా సినిమా ను ఏప్రిల్ 27 న మన ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 

అసలు వేసవి అంటేనే మే లో. ఆ ఎండా కాలం లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న సినిమాలు ఎంటో తెలుసా? ఫస్ట్ ఇంపాక్ట్ తోనే తన నటన - స్టైల్ తో ఆశ్చర్యపరిచిన అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అని మే 4న అనబోతున్నాడు. జయ జానకి నాయక తో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' మే 11 న చెప్పబోతున్నాడు. ఇవే అండీ మార్చ్ నుండి మే వరకు రానున్న సినిమాలు. ఇందులో అన్నిటిమీదా అంచనాలు బాగానే ఉన్నాయి. మరి అవి అంచనాలను అందుకోగలవు అంటారా? చూద్దాం.