ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలంగాణా గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ ఐదవ షోకి పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో నేటి అర్థరాత్రి నుండే తెలంగాణా రాష్ట్రంలో పలు చోట్ల అదనపు షోల ప్రదర్శన జరగనుంది.
ప్రభాస్ (Prabhas)అభిమానులు ఆయన చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2019లో సాహో విడుదల కాగా.. దాదాపు మూడేళ్లు కావస్తుంది. అలాగే రాధే శ్యామ్ సెట్స్ పైకి వెళ్లి నాలుగేళ్లు అవుతుంది. అనేక అవాంతరాల కారణంగా చిత్రం ఆలస్యమైంది. 2022 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా ఆంక్షలతో మరోమారు వాయిదా పడింది. ఎట్టకేలకు సమ్మర్ కానుకగా మార్చి 11న విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాధే శ్యామ్ (Radhe Shyam)సినిమా ఐదో ఆట ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్యలో ఐదో ఆట ప్రదర్శించుకోవచ్చని కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ భీమ్లా నాయక్ సినిమాకు కూడా ఐదో ఆట వేసుకునే అవకాశం కల్పించింది.
తాజాగా రాధే శ్యామ్ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్‌ను హైదరాబాద్ కూకట్‌పల్లి థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మరోవైపు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా పై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. దీంతో రాధేశ్యామ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోయే అవకాశాలున్నాయి.
