బయోపిక్ అంటే ఇప్పుడు అందరికి వెరీ కామన్ గా మారిన హిట్ ఫార్ములా. వర్కౌట్ అయితే ఎదో ఒక విధంగా ఉపయోగపడే బ్రహ్మాస్త్రం. కుదిరితే కలెక్షన్స్ లేదా మంచి గుర్తింపు. ఇకపోతే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబందించిన బయోపిక్స్ ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. 

తెలంగాణ దేవుడు అంటూ ఆరు నిమిషాల ట్రైలర్ ను రీసెంట్ గా వదిలారు. ఇది కేసీఆర్ బయోపిక్ అని అఫీషియల్ చెప్పకపోయినా అందరికి ఈజీగా అర్ధమవుతోంది. శ్రీకాంత్ కేసీఆర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక పేరుతో అభ్యంతరాలు రాకుండా ఉండాలని కథానాయకుడు పేరు విజయ్ దేవ్ గా ప్రజెంట్ చేశారు. 

పోసాని-తనికెళ్ళ భరణి- సుమన్ - అజయ్ - బ్రహ్మానందం - సంగీత వంటి వారు సినిమాలో నటిస్తుండడం ప్లస్ పాయింట్. కేసీఆర్ బాల్యం మొదలుకొని రాజకీయ అడుగులు అలాగే తెలంగాణ ఆవిర్భావం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకు అన్ని అంశాలను చూపించినట్లు తెలుస్తోంది. 

ట్రైలర్ 6 నిమిషాల 3 సెకన్లు ఉండటం గమనార్హం. లవ్ స్టోరీని కూడా యాడ్ చేయడం మరో ఊహించని విషయం. మరి ఈ తెలంగాణ దేవుడు ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడా చూడాలి.  హరీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు.