Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ బయోపిక్‌ జనం చూడద్దనా...ఇలా?

శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా (నూతన పరిచయం) చిత్రం ‘తెలంగాణ దేవుడు’.

Telangana Devudu release on this week jsp
Author
Hyderabad, First Published Apr 20, 2021, 10:51 AM IST

ఓ ప్రక్కన కరోనా విజృంభిస్తోంది. చివరకు తెలంగాణా సీఎం కేసీఆర్ కు సైతం కరోనా వచ్చింది. ఇంత భయంకరమైన పరిస్దితుల్లో సినిమాలకు వెళ్లేవారు ఎవరు..థియోటర్స్ అన్నీ ఖాళీ. వకీల్ సాబ్ వంటి సినిమాకే కలెక్షన్స్ లేవు. అయితే ఈ టైమ్ లో కేసీఆర్ బయోపిక్ సినిమా రిలీజ్ కు పెట్టారు.  ఈ నెల 23న సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చేసారు. ఈ న్యూస్  చూసిన చాలా మంది కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో..ఈ సినిమా చూడవద్దనా ఈ టైమ్ లో పెట్టారు అంటూ మండిపడుతున్నారు. 

 శ్రీకాంత్ టైటిల్‌ పాత్రలో జిషాన్ ఉస్మాన్ హీరోగా (నూతన పరిచయం) చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హీరోయిన్ సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణం ఈ చిత్రంలో నటించారు. వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
  
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్ బయోపిక్ పాత్రలో శ్రీకాంత్ అద్బుతంగా నటించాడు. ఈ చిత్రానికి ఎంతో మంది పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి వారు చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని దర్శకుడు హరీష్ ‘తెలంగాణ దేవుడు’ టైటిల్ పెట్టడం చాలా శుభపరిణామం. ఈ సినిమా గొప్ప విజయం సాధించి చిత్రయూనిట్‌కు మంచిపేరు రావాలి..’’ అని అన్నారు.
    
కేసీఆర్ పాత్రలో నటించిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు హరీష్ నన్ను కలిసి కేసీఆర్‌గారి బయోపిక్ సినిమా చేస్తున్నానని చెప్పి, ఆయన పాత్రలో నువ్వు నటించాలని చెప్పినపుడు షాక్ అయ్యాను. నేను ఆయన పాత్రలో నటించగలనా? లేదా? ఆయన పాత్రకు నేను సూట్ అవుతానా? అనే ఆలోచనతో కొంత టైమ్ తీసుకొని ఎలా చేస్తే బాగుంటుందా అని డిస్కషన్ చేసి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. దేశాన్ని సాధించిన మహాత్మాగాంధీని జాతిపిత అంటారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌గారు కూడా ఒకరకంగా తెలంగాణ దేవుడే. అలాంటి కేసీఆర్ రోల్ నాకు లభించినందుకు ఈ రోజు నేను నిజంగా గర్వపడుతున్నాను.

 ఆ రోజు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకుంటే ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకునే వాడిని. థాంక్స్ హరీష్. ఈ సినిమాలో 50 మంది ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమా కరోనా కంటే ముందు స్టార్ట్ అయ్యింది. కానీ వారందరి డేట్స్ సెట్ అవ్వక సినిమా ఆలస్యం అయ్యింది.  23న విడుదల అవుతున్న ఈ సినిమా చూడడానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకొని సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios