టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (Rip Krishna) కన్నుమూయడంతో  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చింతిస్తున్నారు. తాజాగా స్పందిస్తూ తమ సంతాపం వ్యక్తం చేశారు.  

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. టాలీవుడ్ కి సాహసాలు అంటే ఏంటో నేర్పించిన సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ(79) తాజాగా తుది శ్వాస విడిచారు. మొన్న అర్ధరాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ కృష్ణకు డాక్టర్లు ప్రపంచ స్థాయి చికిత్సను అందించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ ఉదయమే కృష్ణ మరణించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ముుందుగా ఏపీ సీఎం జగన్ (CM Jagan) కృష్ణను కోల్పోవడం పట్ల తన బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ వేదికన కృష్ణ మరణానినికి నివాళి అర్పించారు. ట్వీట్ చేస్తూ.. ‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ బాబుకు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

కొద్ది క్షణాల కిందనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు (CM KCR) కూడా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కావాల్సినంత మద్దతు ఇస్తున్న కేసీఆర్ కృష్ణ మరణ వార్తకు చింతిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరుపున సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేసినట్టు సీఎంవో ప్రకటన చేసింది. ‘ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (శ్రీ ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.’ ట్వీట్ లో తెలిపారు. 

Scroll to load tweet…

కుటుంబ సభ్యులని, కోట్లాది మంది అభిమానులని శోకసంద్రంలో ముంచుతూ ఈరోజు ఉదయం కృష్ణ మృతి చెందారు. తీవ్ర అస్వస్థత, కార్డియాక్ అరెస్ట్ రావడంతో కృష్ణని కుటుంబ సభ్యులు సోమవారం రోజు కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. దీనితో వైద్యులు కృష్ణని ఐసీయూలో ఉంచి అన్ని రకాలుగా చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కృష్ణ మరణంతో సినీలోకం శోకసంద్రంలో నిండిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నారు.