సామ్రాట్ తో పెళ్లెప్పుడని అడుగుతున్నారు.. తేజస్వి కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 11, Aug 2018, 3:25 PM IST
tejaswi about her relationship with samrat
Highlights

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ కొద్దిరోజులకే తాను హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చెలామణి అయింది

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజస్వి మదివాడ కొద్దిరోజులకే తాను హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చెలామణి అయింది. కానీ సామ్రాట్ తో ఆమె వ్యవహారం ముదరడం, హౌస్ లో కొందరిపై గొడవలకు దూసుకెళ్లడం వంటి విషయాలు ఆమె ఎలిమినేషన్ కు కారణమయ్యాయి. హౌస్ లో ఉన్నంతసేపు తేజస్వి ఎక్కువ సమయం సామ్రాట్ తోనే కనిపించేది. ఆమె బయటకి వచ్చేసిన సమయంలో సామ్రాట్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

దీంతో ఇద్దరి ఏదో ఉందనే వార్తలు బలంగా వినిపించాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై తేజస్వి స్పందించింది. ''నాకు సామ్రాట్ ఎనిమిదేళ్ల క్రితమే తెలుసు. కానీ అప్పుడు అంత క్లోజ్ గా ఉండేవాళ్లం కాదు. హౌస్ లోకి వచ్చిన తరువాతే అతడికి పెళ్లయిందని ఏదో సమస్య ఉందని నాకు తెలిసింది. సామ్రాట్ ఎప్పుడూ కూడా అందరినీ నవ్విస్తుంటాడు. అందుకే తనకి బాగా క్లోజ్ అయ్యాను. హౌస్ లో నేను చాలా మందితో బాగా మాట్లాడతాను. కానీ ఛానెల్ వారు తమకు రేటింగ్స్ వచ్చే క్లిప్స్ ను మాత్రమే ఎడిట్ చేసి కొంత భాగమే ప్రేక్షకులకు చూపిస్తున్నారు.

అలా సామ్రాట్ కి నాకు మధ్య ఏదో ఉందనే పుకార్లు ఎక్కువయ్యాయి. దీని కారణంగా సోషల్ మీడియాలో నన్ను బాగా ట్రోల్ చేస్తున్నారు. నా క్యారెక్టర్ ని చంపేస్తున్నారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఒక అబ్బాయితో ఎమోషనల్ గా కనెక్ట్ అయితే తప్పేముంది. నేను ఎవరితో స్నేహం చేయాలో కూడా ట్రోలర్స్ డిసైడ్ చేస్తారా..? కొందరేమో సామ్రాట్ తో పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన పెళ్లితో లింక్ చేస్తారా..? సామ్రాట్ ఎప్పటికీ నాకు మంచి స్నేహితుడు'' అని స్పష్టం చేసింది. 

loader