ఇది చదవాటనికి, వినటానికి బాగుంది కదా. అలా అనుకోవాలనే , ఇలాంటి రెస్పా్స్ రావాలనే, ఉత్సాహంతో తమ గురించి మాట్లాడుకోవాలనే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఇలా చేసారు. ఇందుకు సంభందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ రచ్చ అంటారా...

 `జాంబిరెడ్డి` సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో తేజ సజ్జను విష్వక్సేన్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఇద్దరూ సరదాగా ఇలా మాట్లాడుకున్నారు. ఆ ఇంటర్వ్యూ  ప్రోమోను చిత్ర టీమ్ తాజాగా విడుదల చేసింది. మీరూ ఇక్కడ ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి. 

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా గుర్తుండే ఉంటాడు. ఇటీవలే ‘ఓ బేబీ’ చిత్రంలో.. యువతను రిప్రజెంట్ చేసే పాత్రతో అందర్నీ మెప్పించాడు ఈ యువ నటుడు. ప్రస్తుతం ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాంబిరెడ్డి’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. మంచి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఉన్న ప్ర‌శాంత్.. త‌న మూడో సినిమాగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ‘జాంబి రెడ్డి’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో రూపొందుతున్న ఫస్ట్ జాంబి సినిమా  ఈ నెల ఐదో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. 

‘అ’ వంటి విభిన్నమైన కథతో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ సినిమా చేసాడు. ఈ సినిమాకూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం`జాంబిరెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటివరకు తెలుగులో ఎవ్వరు తెరకెక్కించని మరో విభిన్నమైన కథతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు.