మూడు వందల కోట్లకు చేరువలో హనుమాన్ మూవీ... యంగ్ హీరో రేర్ ఫీట్!


హనుమాన్ బాక్సాఫీస్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఏకంగా మూడు వందల కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. యంగ్ హీరో తేజ సజ్జా అరుదైన ఫీట్ సాధించాడు. 
 

teja sajja starer human movie collections reached three hundred crore mark ksr

అనూహ్యంగా తేజ సజ్జా 2024 సంక్రాంతి విన్నర్ అయ్యాడు. బడా బడా స్టార్స్ ని వెనక్కి నెట్టి అరుదైన విజయం అందుకున్నాడు. కేవలం కంటెంట్ ని నమ్ముకుని హనుమాన్ నిర్మాతలు గుంటూరు కారం చిత్రానికి పోటీగా జనవరి 12న విడుదల చేశారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ హనుమాన్ వసూళ్ల వర్షం కురిపించింది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్ ఆవిష్కరించి టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యాడు. 

హనుమాన్ మూవీ భారీ చిత్రాల దర్శకులకు రిఫరెన్స్ అని పలువురు కొనియాడారు. రామాయణంలోని హనుమంతుడు స్ఫూర్తిగా సూపర్ హీరో కథ తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. హనుమాన్ చిత్ర వసూళ్లు మూడు వంద కోట్లకు చేరువయ్యాయి. 24 రోజులకు గానూ హనుమాన్ మూవీ రూ. 297.26 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక యంగ్ హీరో చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు ఊహించనివే. 

హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జై హనుమాన్ లో స్టార్ హీరో నటిస్తాడని వెల్లడించారు. జై హనుమాన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios