నాని హీరోగా  రూపొందిన టక్ జగదీష్ సినిమా ఏప్రియల్ 23న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ బాగా ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని వాయిదా వేసారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా నాని ప్రకటించారు.  క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల తేది వాయిదా ప‌డిన‌ట్లు  వీడియో ద్వారా వివ‌రించారు నేచుర‌ల్ స్టార్ నాని.

 ``టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుంది.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయింది, అంతేకాదు ఉగాదికి రావాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడింద‌ని  ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో..అప్పుడే కొత్త విడుదల తేదీ కూడా అందులోనే ఉంటుందని తెలిపారు  న్యాచురల్ స్టార్ నాని. 

అయితే ఇప్పుడు అదే రోజున మరో సినిమా రిలీజ్ కు పెట్టారు. అదే ఇష్ట్... బాలనటుడి నుంచి హీరోగా ఎదిగిన వారిలో తేజ సజ్జా ఒకరు. రీసెంట్ గా  విడుదలైన ‘జాంబీరెడ్డి’తో సోలో హీరోగా సక్సెస్‌ అందుకున్నారు. తాజాగా తేజ, ‘ఐ వింక్‌’ బ్యూటీ ప్రియా వారియర్‌ జంటగా ‘ఇష్క్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ‘నాట్‌ ఏ లవ్‌ స్టోరీ’అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ని ఏప్రియల్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

టక్ జగదీష్ విషయానికి వస్తే... నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే ఈ రోజు ఉగాది సంద‌ర్భంగా  అంద‌రికీ శ్రీ ప్ల‌వ నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతూ స్పెష‌ల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ట‌క్ జ‌గ‌దీష్ ఫ్యామిలీ అంతా క‌లిసి ఆనందంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌కి  మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.