Asianet News TeluguAsianet News Telugu

#TejaSajja:‘హనుమాన్‌’ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్ టైటిల్,కాన్సెప్టు

ఇందులో మంచు మ‌నోజ్ విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ సైతం మరో కీ రోల్ లో కనిపించబోతున్నట్లు  వినికిడి.  

Teja Sajja And Manchu Manoj New Project Title Mirayi jsp
Author
First Published Jan 17, 2024, 12:36 PM IST


సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హనుమాన్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే వందకోట్ల మైలురాయిని దాటి దుమ్ము రేపుతోంది. ఇక విదేశాల్లో సైతం ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఉత్తర అమెరికాలో 3 మిలియన్ల డాలర్ల వసూళ్లను దాటింది. అక్కడ ఫస్ట్ వీకెండ్ లో ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి, సలార్‌ రికార్డులను దాటేయడం విశేషం. అమెరికాలో లాంగ్న్‌ల్రో ఈ చిత్రం 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను దాటొచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేఫద్యంలో ఈ చిత్రం హీరో నెక్ట్స్ ప్రాజెక్టు పై అందరి దృష్టీ పడింది. ఇంతకీ ఏమిటి నెక్ట్స్ ప్రాజెక్టు ..ఆ టైటిల్ ఏమిటి

అందుతున్న సమాచారం మేరకు తేజ సజ్జ త‌దుప‌రి ప్రాజెక్ట్ కూడా లాక్ అయింది. పీపుల్స్  మీడియా ఫ్యాక్ట‌రీ తేజ‌తో ఓ సినిమా నిర్మించేందుకు  ఎంగ్రిమెంట్ చేకు చేసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈ చిత్రానికి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం కార్తీక్ అదే నిర్మాణ‌సంస్థ‌లో ర‌వితేజ హీరోగా' ఈగ‌ల్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. కానీ ఆ రిలీజ్ తో సంబంధం లేకుండానే కార్తిక్ ప‌నిత‌నం మెచ్చిన పీపుల్స్  మీడియా ప్యాక్ట‌రీ మ‌రో అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు సమాచారం. ఎలాంటి హ‌డావుడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేసిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. 

అలాగే ఇందులో మంచు మ‌నోజ్ విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ సైతం మరో కీ రోల్ లో కనిపించబోతున్నట్లు  వినికిడి.   అలాగే ఈ సినిమా టైటిల్ కూడా లీకైంది.  మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'మిరాయి' అనే టైటిల్‌ను పెట్టినట్లు తెలిసింది. ధమాకా వన్-ఇయర్ వేడుకల్లో సీనియర్ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య- కార్తీక్ ఘట్టమనేనిని అభినందించారు. ఇదే సంద‌ర్భంలో 'ఈగిల్' .. 'మిరాయి' చిత్రాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ నేప‌థ్యంలోనే తేజ త‌దుప‌రి సినిమా 'మిరాయి' అని తెలుస్తోంది. ఇక మిరాయి అంటే? ఇదొక జ‌ప‌నీస్ ప‌దంగా తెలుస్తోంది. అంటే భ‌విష్య‌త్ అని అర్ధం అని చెప్తున్నారు. ఇందులో హీరోని భ‌విష్య‌త్ లోకి తీసుకెళ్లి? ఆ కాలంలో ఏం జ‌ర‌గ‌బోతుంది? అన్న‌ది క‌థ‌లో హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు చెప్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios