సారాంశం

బిగ్‌ బాస్‌ తెలుగు 7 వ సీజన్ ఆకట్టుకునేలా సాగుతుంది. గొడవలు, ఫైట్లు, అలకలు, ప్రేమలు ఆకట్టుకుంటున్నాయి. అయితే శోభా శెట్టి వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది.

బిగ్‌ బాస్‌ తెలుగు 7.. రసవత్తరంగా సాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ హాట్‌ హాట్‌గా సాగుతుంది. మరోవైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు, టాస్క్ లో మిస్టేకులు హౌజ్‌లో రచ్చ చేస్తున్నాయి. అదే సమయంలో పులిహోర కలపడాలు కూడా జరుగుతున్నాయి. ఇక బుధవారం ఎపిసోడ్‌లో తేజ, శోభాశెట్టి మధ్య జరిగిన కన్వర్జేషన్‌ ఆకట్టుకుంది. పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. ఈడు జోడు సెట్‌ అవుతుందని, ఆమె కోసం సిక్స్ ప్యాక్‌ చేస్తానని చెప్పడం ఆకట్టుకుంది. అయితే తేజ మంచోడంటూ, అది తప్ప ఆయనలో ఏం లేదని శోభా శెట్టి, ప్రియాంకలు చర్చించుకున్నారు. 

ఇక కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో ప్రియాంక, శోభాశెట్టి, అమర్‌ దీప్‌, తేజ పాల్గొన్నారు. నీటిలో మునిగే వస్తువులను, మునగని వస్తువులను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఎక్కువగా గుర్తించిన ప్రియాంక కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచారు. శోభా శెట్టి రెండో స్థానంలో నిలవగా, తేజ, అమర్‌ దీప్‌ టై అయ్యింది. మళ్లీ ఈ ఇద్దరికి నిర్వహించగా, తేజ విన్‌ అయ్యారు. అమర్‌ దీప్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ముందుగా ఈ పోటీలో పాల్గొనే సమయంలో అమర్‌ దీప్‌, భోలే మధ్య కన్వర్జేషన్‌ హాట్‌గా సాగింది. అమర్‌ దీప్‌ అనవసరంగా భోలేని గెలకడం ఆశ్చర్యపరిచింది. 

దీంతోపాటు తేజ, అమర్‌ దీప్‌ ల మధ్య జరిగిన టాస్క్ లో శోభా.. అమర్‌కి సిగ్నల్ ఇస్తుండగా, ఆయన తీసుకోలేదు, దీంతో తేజకి తాను చెప్పినట్టు శోభా శెట్టి చెప్పింది. దీనికి సంబంధించిన ఇష్యూ మాట మాట అనుకుని శోభాశెట్టి, తేజల మధ్య వివాదం పెరిగింది. ఒకరిపై ఒకరు ఫైర్‌ అయ్యారు. సవాళ్లు విసురుకునేంత వరకు ఈ పోటీ వెళ్లడం విశేషం. మరోవైపు మరో కెప్టెన్సీ కంటెండర్‌కి సంబంధించిన పోటీలో నలుగురు ప్రశాంత్‌, రతిక, యావర్‌,గౌతమ్‌ పాల్గొన్నారు. ఇందులో పల్లవి ప్రశాంత్‌ విన్‌ అయ్యాడు. ఇందులో రతిక రేసు నుంచి తప్పుకుంది. 

మరోవైపు హౌజ్‌లో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. అశ్విని, యావర్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ జరిగింది. హౌజ్‌లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారని అశ్విని.. యావర్‌తో చెప్పింది. బిగ్‌ బాస్‌ అంటేనే ఇలానే ఉంటుందిలే అని తనని తాను సమర్థించుకుంది. అయితే హౌజ్‌లో ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎవరితో కనెక్ట్ అయ్యావని పులిహోర కలిపింది అశ్విని. దీనికి యావర్‌ చెబుతూ రతికతో కనెక్ట్ అయినట్టు చెప్పాడు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, దీంతో గ్యాప్‌ వచ్చిందని, ఇప్పుడు ఫర్వాలేదని తెలిపారు. అయితే చూడబోతుంటే అశ్విని.. యావర్‌తో పులిహోర కలుపుతుందని అనిపిస్తుంది. 

ఇంకోవైపు డ్రామా క్వీన్‌గా పేరుతెచ్చుకున్న శోభా శెట్టి హౌజ్‌లో అనవసరంగా గొడవలు పెట్టుకోవడం అతిగా అనిపించింది. కెప్టెన్సీ టాస్క్ లో అమర్‌ దీప్‌ విషయంలో కాస్త రచ్చ చేసే ప్రయత్నం చేసింది. తేజతో ఏకంగా వార్నింగ్‌లు ఇచ్చుకునే వరకు వెళ్లింది. ఇంకోవైపు కిచెన్‌లో ప్రియాంకతోనూ గొడవకి దిగింది. ఆమె వ్యవహారం కాస్త అతిగా, అసహజంగా అనిపిస్తుంది.