ఈ రోజు పవన్ కళ్యాణ్   #BRO టీమ్ పెద్దమ్మ తల్లి గుళ్ళో భోజనాలు పెట్టుకున్నారని సమాచారం. ఈ చిత్రం నిర్మాతలు పీపుల్స్ మీడియా సంస్ధ వారు ఈ భోజనాలు ఏర్పాటు చేసారు. 

సినిమా వాళ్లు, టీవి వాళ్లు ... పెద్దమ్మ గుళ్లో భోజనాలు పెట్టడం అనేది చాలా కాలంగా చేస్తున్నారు. తమ టీమ్ అంతటినీ అక్కడ భోజనాలు పెడతారు. పెద్దమ్మ తల్లిని దర్శించి భోజనాలు చేస్తారు. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ #BRO టీమ్ పెద్దమ్మ తల్లి గుళ్ళో భోజనాలు పెట్టుకున్నారని సమాచారం. ఈ చిత్రం నిర్మాతలు పీపుల్స్ మీడియా సంస్ధ వారు ఈ భోజనాలు ఏర్పాటు చేసారు. శ్రీ పెద్దమ్మ దేవాలయం హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంటుగా మారింది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్, OG అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన పవన్ తాజాగా #BRO పై దృష్టి పెట్టారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక సినిమా చేస్తుననారు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతంకు ఫ్రీమేక్ గా దర్శకుడు సముద్ర ఖని నేతృత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఇప్పటికే బ్రో మోషన్ పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో ఉన్న పవన్ కల్యాణ్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు 

ఒక యాక్సిడెంట్‌లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది.

తమిళంలో తంబి రామయ్య పోషించిన పాత్రను సాయిధరమ్‌ తేజ్‌ చేస్తున్నాడు. దేవుడిగా పవన్‌ కళ్యాణ్‌ కనిపించనున్నాడు. ఇప్పటికే పవన్‌ షూటింగ్‌ పూర్తయిపోయిందని సమాచారం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.