ఫైనల్ గా ట్యాక్సీ వాలా సినిమాతో మరోసారి తన సత్తా చాటిన విజయ్ దేవరకొండా మంచి ఎనర్జీతో సక్సెస్ యాత్రలను కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా భీమవరంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. యువత భారీ స్థాయిలో ఈవెంట్ లో పాల్గొనగా చిత్ర యూనిట్ వారిని చూసి ఆశ్చర్యపోయింది. 

ఇక దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి మా టీమ్ సభ్యులందరం బయలుదేరుతున్నప్పుడు ఇంతదూరం సక్సెస్ మీట్ ను ఎందుకు ప్లాన్ చేశారని అనుకున్నాం. కానీ ఇక్కడికి రాగానే గెట్ ఎంట్రిలోనే మీ ఎనర్జీకి వైబ్రేషన్స్ వచ్చాయి. బిల్డింగ్ మొత్తం కదిలిపోయిందని అన్నారు.  

సినిమా గురించి చెబుతూ.. మొదట నేను నా రైటర్ 2016 నుంచి కథతో ట్రావెల్ అయ్యాం. ఇక చాలా మంది హీరోలకు ఈ కథ గురించి చెప్పం. కథ విని కొంత మంది నిద్రపోయారూ. ఇక మా అదృష్టం బావుండి జీఏ2 పిక్చ‌ర్స్‌, యువి క్రియేష‌న్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యాయి. ఇక విజయ్ దేవరకొండ లాంటి హీరో కూడా దొరకడం మా లక్కీ అంటూ.. విజయ్ దేవరకొ యూత్ కే కాదు మాకు కూడా స్ఫూర్తి అంటూ దర్శకుడు రాహుల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.