దర్శకుడిగా తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు తాతినేని రామారావు. ఆయన కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలవడం విశేషం. రీమేక్‌ చిత్రాలతో బాలీవుడ్‌లో పాగా వేశారు. 

తెలుగు డైరెక్టర్‌ తాతినేని రామారావు(టీ. రామారావు)(Tatineni Ramarao) హఠాన్మరణం టాలీవుడ్‌, బాలీవుడ్‌లో విషాదం నింపింది. నిన్న(మంగళవారం) ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్‌ ఏషియన్‌ నారాయణ్‌ దాస్‌ నారంగ్ మరణం, ఇప్పుడు టి. రామరావు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక ప్రముఖుడి మరణం నుంచి కోలుకోకుండానే మరొకరు మరణించడం అత్యంత విషాదకరం. తాతినేని రామారావు రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచార. 

ఇక దర్శకుడిగా తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు తాతినేని రామారావు. ఆయన కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలవడం విశేషం. అప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీలోనూ జానపద, పురాణ నేపథ్య చిత్రాలు రూపొందుతున్న నేపథ్యంలో సాంఘీకాలను రూపొందించారు. వాటికి కాస్త కమర్షియల్‌ హంగులు అద్ది హిట్‌ కొట్టారాయన. అదేసమయంలో తమిళ నెటివిటీని సినిమా ద్వారా నార్త్‌కి తీసుకెళ్లారు. ఆయన తన మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో డెబ్బై వరకు సినిమాలకు దర్శకత్వం వహిస్తే, అందులో ఇరవైకిపైగా చిత్రాలు రీమేక్‌లే ఉండటం గమనార్హం. 

రీమేక్‌ చిత్రాలు కూడా ఆయన తమిళం నుంచే తీసుకున్నారు. కొన్ని తెలుగులో రీమేక్‌ చేయగా, చాలా వరకు హిందీ(Bollywood)లో రీమేక్‌(Remake) చేశారు. ఇలా తమిళ నెటివిటీని ఆయన నార్త్ కి తీసుకెళ్లారు. అదే సమయంలో తమిళ నెటివిటీలో కొన్ని మార్పులు చేసి, కమర్షియల్‌ హంగులు అద్ది హిందీలో హిట్లు కొట్టారు. తెలుగులో ఆయన తొలి సినిమా `నవరాత్రి` తమిళ రీమేక్‌. అలాగే హిందీలో ఆయన తొలి చిత్రం `లోక్‌ పర్లోక్‌` సైతం తెలుగు `యమగోల` రీమేక్‌. హిందీలో ఆయన 38 సినిమాలకు దర్శకత్వం వహించగా, అందులో తర్వాత వరుసగా 19 సినిమాలు రీమేక్‌ చేశారు.

 రీమేక్‌లోనూ చాలా వరకు తమిళ సినిమాలే ఉండటం విశేషం. అప్పట్లో రీమేక్‌ల స్పెషలిస్ట్ గానూ టి. రామారావు మారిపోయారు. రీమేక్‌ల్లోనూ తన మార్క్ అంశాలు జోడించి హిట్‌ కొట్టడం ఆయన ప్రత్యేకత. హిందీలో `జుడాయి`, `మాంగ్‌ భరో సజనా`, `ఏక్‌ హై భూల్‌`, `జీవన ధార`, `హే తో కమాల్‌ హో గయా`, `అందా కానూన్‌`, `ముజే ఇన్‌సాఫ్‌ చయియే`, `ఇంక్విలాబ్‌`, `యే దేశ్‌`, `జాన్‌ జాని జనార్థన్‌`, `నజీబ్‌ అప్నా`, `సదా సుహగన్‌`, `దోస్తీ దుష్మని`, `నాచే మయురి`, `సన్‌సార్‌`, `ఖట్రాన్‌ కి ఖిలాడీ`, `ప్రతీకార్‌`, `ముఖద్దార్‌ కా బాద్షా`, `ముఖబ్లా`, `మిస్టర్‌ అజాద్‌`, `రావన్‌రాజ్‌`, `జుంగ్‌`, `బేటి నెంబర్‌ 1` వంటి చిత్రాలున్నాయి. 

దర్శకుడిగానే కాదు, నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. ఆయన తెలుగు, తమిళం, హిందీలో దాదాపు పదిహేను చిత్రాలను నిర్మించారు. తెలుగులో `వెంకీ` సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా, హిందీలో ఐదు, తమిళంలో 9 సినిమాలు నిర్మించారు. తాతినేనికి భార్య జయశ్రీ, ఇద్దరుకుమార్తెలు చాముండేశ్వరి, నాగసుశీల, కుమారుడు అజయ్‌ ఉన్నారు. అజయ్‌ నిర్మాతగా రాణించారు.