`పెళ్ళి చూపులు` ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ ఓ వైపు వెంకీ మామతో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన కథపై వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ మెరుపు మెరిసారు. `మెరిసే మెరిసే` చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ లుక్‌ ఆకట్టుకుంటోంది. 

కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో `హుషారు` ఫేమ్‌ దినేష్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్నారు. శ్వేత అవస్తీ హీరోయిన్‌గా నటిస్తుంది. కామెడీ, లవ్‌, ఎమోషన్స్  మేళవింపుగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 

దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ, 
ప్రస్తుతం `మెరిసే మెరిసే` చిత్రం డిఐ వర్క్స్  అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఇటీవల విడుదలైన సినిమా థీమ్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అన్ని వర్గాలకు నచ్చుతుంద`న్నారు. ఇక తరుణ్‌ భాస్కర్‌ `పెళ్ళి చూపులు తర్వాత తెరకెక్కించిన `ఈ నగరానికి ఏమైంది` సినిమా యావరేజ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన నటుడిగానూ బిజీ అవుతున్నారు.