ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిగా సరైన హిట్టుని అందుకోలేకపోయింది. అయితే కొన్నిరోజుల క్రితం అక్షరకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు కొన్ని ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. కావాలనే తన ఫోటోలను లీక్ చేశారని అక్షర పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ నటిగా సరైన హిట్టుని అందుకోలేకపోయింది. అయితే కొన్నిరోజుల క్రితం అక్షరకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు కొన్ని ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి.
కావాలనే తన ఫోటోలను లీక్ చేశారని అక్షర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు అక్షర మాజీ బాయ్ ఫ్రెండ్ ఒకప్పటి హీరోయిన్ అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఫోటోలు లీక్ అయిన విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తనూజ్ పోలీసులకు వెల్లడించాడు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''నాలుగేళ్ల క్రితం నేను అక్షర రిలేషన్ షిప్ ఉన్నాం. ఆ సమయంలో తనే నాకు ఆ ఫోటోలని పంపింది. కానీ ఆమెతో రిలేషన్ బ్రేక్ అయిన తరువాత ఆ ఫోటోలను నా ఫోన్ నుండి డిలీట్ చేసేసాను.
ఆ తరువాత నా ఫోన్ కూడా పోయింది. ఇప్పుడు ఆ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయనే విషయం మాత్రం నాకు తెలియదు. అక్షర ఇప్పటికి నా మంచి ఫ్రెండ్. ఆమెతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో పోలీసులు మరోసారి తనూజ్ ని ప్రశ్నించే అవకాశం ఉంది.
సంబంధిత వార్త..
