ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. బెడ్ రూమ్ లో బికినీ వేసుకొని తీసుకున్న సెల్ఫీ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై అక్షర హాసన్ వెంటనే స్పందించలేదు.

రీసెంట్ గా ఆమె ఈ ఫోటోలు లీక్ అవ్వడంపై కాస్త భిన్నంగా స్పందించింది. ''ఆ ఫోటోలు లీక్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ సినిమా ఫోటో షూట్ సందర్భంగా తీసుకున్న స్టిల్స్ అవి. కావాలని తీసుకున్న ఫోటోలు కాదు. అయినా ఆ స్టిల్స్ లో తప్పేముంది.

మరోసారి అలాంటి ఫోటోలు తీసుకోవడానికి కూడా నేనేం వెనుకాడను. అయినప్పటికీ ఈ ఫోటోలు లీక్ అవ్వడంపై పోలీసులకి కంప్లైంట్ చేస్తాను'' అంటూ వెల్లడించింది. అలా ఫోటోలు తీసుకోవడంలో తప్పు లేదంటూనే పోలీసులకు ఫిర్యాదు మాత్రం చేస్తానంటోంది.

ఫోటో షూట్ టైమ్ లో తీసిన స్టిల్స్ లో కొన్నింటిని మాత్రమే వాడుకోవాలని, మిగిలిన స్టిల్స్ ని తొలగించాలని కానీ అలా చేయకుండా ఇలా ఇంటర్నెట్ లో పెట్టడం కరెక్ట్ కాదని అంటోంది. తన పర్మిషన్ తీసుకోకుండా ఇలా  చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటోంది. 

సంబంధిత వార్త.. 

కమల్ ఫ్యామిలీ షాక్: అక్షరహాసన్ ప్రెవేట్ ఫొటోలు లీక్‌!