చిన్న సినిమాలకు మినహాయింపులు ఇవ్వాలని ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (tammareddy bharadwaj) తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరారు. ఐదు షోలు అడుగుతున్నామని.. చిన్న సినిమాలు ఆడేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో (YS Jagan) సినీ పెద్దల భేటీ కానున్ననేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిన్న సినిమాలకు మినహాయింపులు ఇవ్వాలని ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరారు. ఐదు షోలు అడుగుతున్నామని.. చిన్న సినిమాలు ఆడేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. నంది అవార్డులు ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. 2013 నుంచి అవార్డులు ఆగిపోయాయని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తామని కమిటీలు వేశారు.. కానీ ఇవ్వలేదని చెప్పారు. ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కమిటీలు వేసిందని.. కానీ అవార్డులు ఇవ్వలేదని చెప్పారు. 

సినీ పరిశ్రమ అభివృద్ది చెందాలంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నారు. తెలంగాణలో లోకేషన్ చార్జీలు తీసేయమని అడిగామని చెప్పారు. ఇటీవల ప్రభుత్వంతో చర్చలు జరిగాయని.. పాజిటివ్‌గా ఉన్న కూడా చేయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోకేషన్ చార్జీలు జీరో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో కూడా జీరో చేయాలని కోరారు. గతంలో మినీ థియేటర్లు నాలుగైదు చోట్ల పెట్టారని.. కానీ ఆ తర్వాత ఆగిపోయిందన్నారు. మినీ థియేటర్లు చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా రెవెన్యూ పెరిగేదన్నారు. పబ్లిసిటీ చేస్తేనే సినిమా ఆడుతుందని అనుకోవడం సరికాదన్నారు. సినిమా బాగుంటే, ఇరగదీస్తుందని పుష్ప సినిమాతో స్పష్టం అయిందన్నారు. అఖండ సినిమా కూడా బాగా ఆడిందన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో (YS Jagan) సినీ పెద్దల భేటీ కానున్ననేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి, ఎవరూ వెళ్లిన ఇండస్ట్రీ సమస్యల గురించే మాట్లాడుతారు. తాము ప్రభుత్వానికి ఇప్పటికే రిప్రజంటేషన్ ఇచ్చాం. సీఎం జగన్ చిరంజీవిని పిలిచారని.. ఆయనను ఒక్కరినే ఎందుకు పిలిచారో తెలియదు. ప్రభుత్వాలు గుర్తించిన అసోషియేషన్లతో మాట్లాడాలని అన్నారు. వారితో పాటు సినీ పెద్దలను కూడా పిలవాలి. ఆయనను పిలిచారు కాబట్టే వెళ్లారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవారిని పిలవాల్సిన అవసరం ఉంది. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్ష్.. రెండు అసోసియేషన్‌లను ప్రభుత్వాలు గుర్తించాయి. చిరంజీవి ఒక్కరినే పిలిస్తే.. ఆయన అందరిని తీసుకొస్తానని చెప్పలేరు కదా..

అసోసియేన్లను పిలిస్తే వాళ్లు చెప్పాల్సింది చెప్తారు. చిరంజీవి లాంటి పెద్ద మనుషులు ఉంటే దానిని మరింత వాల్యూ ఉంటుంది. తొందరగా పనులు అయ్యే అవకాశం ఉంటుంది. చిరంజీవికి తాము చెప్పేదంతా చెప్తామని.. ఆయనకు అర్థం అయింది అక్కడికి వెళ్లి చెప్తారు. అయితే కొన్ని స్టేజ్‌లు అయ్యాక మర్చిపోవచ్చు. సగం చెప్పొచ్చు.. సగం చెప్పకపోవచ్చు. వాళ్లు అడిగకపోతే మోహమాట పడవచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా.. ఇవన్నింటికీ తర్వాత అనుమానాలు వచ్చి అనవసరమైని ఆయనపై బురద జల్లడమే. ఒక రకంగా ప్రభుత్వం చిరంజీవికి చెడు చేస్తున్నట్టే’ అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. 

టికెట్లను ఇంతకుముందు ఎక్కువ రేట్లకు అమ్మామని.. అప్పుడు ట్యాక్స్ కట్టలేదని తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు టికెట్ రేట్ల ధర తగ్గించారని.. ఎక్కువ రేటుకు అమ్మే అవకాశం రాకపో అన్నారు. వేరియేబుల్ రేట్లను పెట్టి టికెట్ రేట్లను పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని.. ట్యాక్స్ కడతామని చెబుతున్నారని తెలిపారు. ఇప్పుడు సఫరేట్‌ వెళితే టికెట్ రేట్లు పెంచుకుంటామని అడుగుతారేమో తమకు తెలియదని అన్నారు.