తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ ఎన్నికలు నేడు వేడి వేడిగా జరుగుతున్నాయి. ఇందులో దిల్‌రాజు, సి కళ్యాణ్ ప్యానెల్స్ పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ హాట్‌ కామెంట్‌ చేశారు. 

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్(టీఎఫ్‌సీసీ) ఎన్నికలు నేడు(ఆదివారం)ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన దర్శఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తనకు అనిపించింది నిర్మొహమాటంగా చెప్పే తమ్మారెడ్డి.. ఈ ఎన్నికలు చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌కి ఎన్నికలు జరుగుతున్నాయని ఆనంద పడాలో, లేక జనరల్‌ ఎలక్షన్లని తలపిస్తున్నాయని సిగ్గుపడాలో తెలియడం లేదన్నారు.

అదే సమయంలో సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను కూడా చాలా ఎలక్షన్లని చూశానని, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గానూ గెలిచానని, కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల క్యాంపెయిన్‌ చూస్తుంటే భయమేస్తుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి జరగకూడదని కోరుకుంటున్నట్టు తమ్మారెడ్డి వెల్లడించారు. 

ఆ మధ్య `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడానికి 80కోట్లు ఖర్చు చేశారని కామెంట్‌ చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు తమ్మారెడ్డి. అంతకు ముందు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీశాయి. జరుగుతున్న విషయాన్ని యదాతథంగా చెప్పే క్రమంలో వివాదాల్లో ఇరుక్కుంటున్నారు తమ్మారెడ్డి. ఇప్పుడు కూడా ఆయన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. 

ఇక ప్రతిరెండేళ్లకి ఒకసారి జరిగే ఫిల్మ్ ఛాంబర్‌ ఎన్నికలు నేడు(జులై 30న) జరుగుతున్నాయి. దీనికోసం నిర్మాతలు సీ కళ్యాణ్‌, దిల్‌రాజు పోటీపడుతున్నారు. వారి ప్యానెల్స్ ఈ పోటీలో ఉన్నాయి. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఈ ఇద్దరు చేస్తున్న కామెంట్లు, ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. నిన్న మీడియాతో దిల్‌రాజు మాట్లాడుతూ, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న సభ్యులతో దిల్‌రాజు ప్యానెల్‌ ఉందని, ఎన్నికల్లో నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్‌ విభాగాల వారు పాల్గొంటారు. అయితే ఎగ్జిబిటర్లకి, నిర్మాతలకు సమస్యలున్నాయని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు కొత్త ఐడియాలతో తమ ప్యానెల్‌ వస్తుందన్నారు. 

ఒక వ్యక్తికి పది బ్యానర్లు ఉన్నా, ఒక ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుందని, ఇక్కడ సభ్యులు 1500 మందిఉన్నారు, కానీ యాక్టీవ్‌గా ఉండేది 10 మంది మాత్రమే, మూడు ఏళ్లలో సినిమా తీసిన వాళ్లు మాత్రమే ఈసీలో కూర్చోవాలని చెప్పాం, దానికి వాళ్లు ఒప్పుకోలేదు, ఇక్కడ సక్సెస్‌ లేకపోతే వెనకబడిపోతాం, అందుకే ప్రొడ్యూస్‌ గిల్డ్ పెట్టాం, మాకున్న సమస్య, ఛాంబర్‌ బైలాలో మార్పులు జరగాలి, బైలాను మార్చుకుంటే భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులుండవని తెలిపారు దిల్‌రాజు. దేశ వ్యాప్తంగా క్యూబ్‌, యూఎఫ్‌వో రేట్ల విషయంలో సమస్య ఉంది, దీన్ని అందరం కలుపుని సమస్యని అధిగమించాలన్నారు. రెండేళ్లు ఛాన్స్ ఇస్తే మేం చేసి చూపిస్తామన్నారు దిల్‌రాజు.

సుమారు 1600 మంది సభ్యులున్న ఫిల్మ్ ఛాంబర్‌ ఎన్నికలు ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతాయి. 4 గంటలకు కౌంటింగ్‌ స్టార్ట్ అవుతుంది. ఆరు గంటల తర్వాత రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతం ఈ 12 గంటల వరకు మొత్తం 710 కోట్లు నమోదయ్యాయి.