తమిళ స్టార్ హీరో సూర్య Suriya అప్ కమింగ్ ఫిల్మ్ ‘కంగువా’. ఈ చిత్రం నుంచి పండగ సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది యూనిట్. అందేంటంటే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా నటిస్తున్నచిత్రం ‘కంగువా’ (Kanguva) . శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం 2024లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కు అంచనాలు పెరిగిపోయాయి. కంగువా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక సంక్రాంతి Sankranthi 2024 పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించింది. రేపు (జనవరి 16న) ఉయదం 11 గంటలకు ఈ చిత్రం నుంచి సూర్య సెకండ్ లుక్ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ అనౌన్స్ మెంట్ అందిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సూర్య చేయి ఎత్తి చూపిన పోస్టర్ ను విడుదల చేశారు. చేతిపై గద్ద పచ్చబొట్టు కనిపిస్తుండటం రేపటి అప్డేట్ పై ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ స్కేల్లో, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 11న ఈ చిత్రం ఏకంగా 38 భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.
