Asianet News TeluguAsianet News Telugu

Kanguva 2nd Look : ‘కంగువా’ సెకండ్ లుక్ చూశారా? సినిమాపై హైప్ పెంచేసిన టీమ్..

తమిళ స్టార్ హీరో సూర్య Suriya  లేటెస్ట్ ఫిల్మ్ అప్ ‘కంగువా’ Kanguva. ఈ చిత్రం నుంచి పండగ సందర్భంగా సూర్య సెకండ్ లుక్ పోస్టర్ ను యూనిట్ తాజాగా విడుదల చేసింది.  

Tamilstar Suriya Kanguva 2nd look Poster Out  NSK
Author
First Published Jan 16, 2024, 12:44 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)  తాజాగా నటిస్తున్నచిత్రం ‘కంగువా’ (Kanguva) . ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు  శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే ఆసక్తికరమైన అప్డేట్స్ ను అందుతున్నాయి. దీంతో నార్మల్ ఆడియెన్స్ లోనూ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఇప్పటికే ‘కంగువా’ నుంచి సూర్య ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. అలాగే పవర్ ఫుల్ ‘గ్లింప్స్’ కూడా వచ్చింది. తెగ నాయకుడిగా, యుద్ధవీరుడిగా సూర్య మొదటి లుక్ ఇప్పటి వరకు గూస్ బంప్స్ తెప్పించింది. ఇక తాజాగా సంక్రాంతి ఫెస్టివల్ ట్రీట్ గా రెండో లుక్ ను కూడా యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం పోస్టర్ ఆకట్టుకుంటోంది. 

అయితే, పోస్టర్ విషయానికొస్తే.. సూర్య మొదటి లుక్ వారియర్ గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. భయకరంగా, గంభీరంగా వారియర్ గా కనిపించారు సూర్య. ఇక సెకండ్ లుక్ లో సూర్య మోడ్రన్ లుక్ లో కనిపించారు. ఆధునిక కాలానికి సంబంధించిన వ్యక్తిగా పరిచయం అయ్యారు. రెండు వేర్వేరు కాలాల్లో కథ ఉందనేది ఈ పోస్టర్లతో అర్థమవుతోంది. ఇక మేకర్స్ పోస్టర్ ను రివీల్ చేస్తూ... ‘కాలం కంటే గమ్యం కాలం బలమైంది. గతం, వర్తమానం, భవిష్యత్... అన్నింట్లో ప్రతిధ్వనించే పేరే కంగువా!’ అంటూ వివరించారు. దీంతో సినిమా సబ్జెక్ట్ పై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

ఇక సూర్య తన సినిమాల కోసం ఎంతటి కృషి చేస్తారో తెలిసిందే. ప్రస్తుతం కంగువా కోసం తన లుక్ ను మొత్తం మార్చేశారు. మేకోవర్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani)  జంగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. స్టూడియో గ్రీన్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ స్కేల్లో రూపుదిద్దుకుంటోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏకంగా 38 భాషల్లో విడుదలవుతుండటంతో పాటు పది భాషల్లో 3డీలోనూ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 11న విడుదల కానుందని అంటున్నారు. 

Tamilstar Suriya Kanguva 2nd look Poster Out  NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios