టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్ 2’. చిత్ర టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుండగా.. టీజర్ పై తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ రియాక్ట్ అయ్యారు.

విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు నచ్చిన సినిమాలను చేస్తున్నారు టాలెంటెడ్ అండ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh). చివరిగా ‘మేజర్’తో మంచి సక్సెస్ అందుకున్న శేష్ ప్రస్తుతం ‘హిట్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రెండేండ్ల కింద ‘హిట్ : ఫస్ట్ కేస్’గా విడుదలైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో మోస్ట్ అవైటెడ్ సిరీస్ లలో ‘హిట్’ (Hit Verse) కూడా చేరిపోయింది. ఈ క్రమంలో దర్శకుడు హిట్ వెర్స్ ను వివరించి మరింత ఆసక్తి పెంచారు. 

కాగా, ఈ రోజు విడుదలైన ‘హిట్ : ది సెకండ్ కేస్’ (Hit 2) టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. థ్రిల్లింగ్ అంశాలతో మరింత ఆసక్తికరంగా సినిమా ఉండబోతోందని టీజర్ ద్వారా హామీనిచ్చారు యూనిట్. ఆడియెన్స్ నుంచి వేరే లెవల్లో రెస్పాన్స్ దక్కుతుండగా.. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) కూడా స్పందించారు. టీజర్ పై తన రివ్యూను ఇచ్చారు. టీజర్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఘాటుగా మరియు దృష్టిని ఆకర్షించేలా కనిపిస్తున్నాయని తెలిపారు. చిత్రంలో నటించిన అడివిశేష్, యూనిట్ కు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ఇక కార్తీ రీసెంట్ గా ‘సర్దార్’తో మంచి సక్సెస్ ను అందుకున్నారు.

మరికొద్ది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రం దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకోగా.. ఈ రోజు విడుదలైన టీజర్ కు మరింత రెస్పాన్స్ వస్తుండటం విశేషం. 

శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. బాణు చందర్, రావు రమేష్, పోసాని క్రిష్ణ మురళీ, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. 

Scroll to load tweet…