వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు. గెలుపు ఓటములు పట్టించుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్న ఈ స్టార్ హీరో... తాజాగా తన 34వ సినిమాను స్టార్ట్ చేశారు.  

ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశాల్‌. వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నా.. ఏమాత్రం తగ్గకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. హరి దర్శకత్వంలో కొత్త సినిమా విశాల్‌ 34 కు విశాల్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 


గతేడాది లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్ . ఈసినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కోట్టింది. పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈసినిమా.. ఆడియన్స్ ను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అయినా సరే ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశాల్‌. ఈ టాలెంటెడ్‌ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

విశాల్‌ ప్రస్తుతం తన 34వ సినిమా ఓపెనింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. విశాల్‌ 34 గా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తుండగా.. మధ్యలో స్టెతస్కోప్‌ చూడొచ్చు. విశాల్ ఇందులో డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మాస్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తాజా ప్రాజెక్ట్‌ ఉండబోతున్నట్టు హింట్‌ ఇచ్చేశాడు డైరెక్టర్ హరి. 

Scroll to load tweet…

గతంలో భరణి, పూజ సినిమాలు చేసిన తరువాత హరి డైరెక్షన్ లో విశాల్‌ నటిస్తోన్న మూడో యాక్షన్ సినిమా ఇది కావడంతో విశేషం. ఈసినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబతున్నారు. స్టార్ కాస్ట్ ఎవరు నటిస్తారు అనేవిషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు మేకర్స్. 
 స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.