ఈమధ్య దూకుడు చూపిస్తున్నాడు తమిళ హీరో సూర్య. చాలా కాలం స్థబ్దుగా ఉన్న ఈ హీరో.. రీసెంట్ గా రచ్చ రచ్చ చేస్తున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న సూర్య..తన కొత్త సినిమా కోసం 100 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడట..?
అటు హీరోగా ఇటు నిర్మాతగా ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు తమిళ స్టార్ సూర్య. వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు సీనియర్ స్టార్. థియేటర్ అయినా.. ఓటీటీ అయినా.. హిట్టు పక్కాగా పడుతుంది సూర్యకు. దాంతో ఆయన డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది తమిళనాట. సూర్య సినిమా అంటే కోలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ అంతా మర్కెట్ గట్టిగానే ఉంటుంది. దాంతో ఆయన సినిమాలకు గట్టిగా రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం సూర్య వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు, శివ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా సూర్యకి 42వ సినిమా ఇది. ఈ మధ్యనే ఓపెనింగ్ చేసుకుని సెట్స్ పైకి వెళ్ళింది ఈ సినిమా. ఇలా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో.. షూటింగ్ స్టార్ట్ అవుతుండగానే.. చకచకా సినిమా బిజినెస్ కూడా అయిపోతోంది. రీసెంట్ గానే ఈ సినిమా డిజిటల్ డీల్ పూర్తయినట్టుగా తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ సూర్య సినిమా కోసం డిజిటల్ హక్కులను 100కోట్లకు సొంతం చేసుకుందని కోలీవుడ్ టాక్. ఆకాశం నీహద్దురా , జై భీమ్ సినిమాల నుంచి ఓటీటీ సెంటర్ లో సూర్య సినిమాలకి విపరీతమైనక్రేజ్ ఏర్పడింది దాంతో ఆయన సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. అందువల్లనే ఆయన సినిమాల హక్కుల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై గట్టిపోటీనే కనిపిస్తోంది. ఎన్ని కోట్లు పెట్టడానికైనా వెనకాడటంలేదు మేకర్స్. ఎంత పెట్టినా రాబట్టుకుంటాం అన్న నమ్మకం వారిలో కనిపిస్తోంది.
యాక్షన్, ఎమోషన్ మిక్సింగ్ కథలతో సినిమాలు చేయడంలో డైరెక్టర్ శివకు మంచి పేరుంది. అటువంటి కథలు
గా తెరకెక్కిస్తాడనే పేరు శివకి ఉంది. అజిత్ కి వరుస హిట్లు ఇచ్చిన శివ... రీసెంట్ గా అన్నాత్తే సినిమాతో రజనీ అభిమానులను మాత్రం నిరాశపరిచాడు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు శివ. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, సూర్య సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తోంది.
