ఈ సినిమా సమాజానికి హానికారమైన సందేశాన్ని ఇచ్చే విధంగా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌పై పలు వివాదాలు క్రియేట్ అయ్యాయి.


గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న అదాశర్మ తాజా చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమా మొన్న శుక్రవారం రిలీజైంది. గత కొంత కాలంగా కేరళలో (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు ఆరోపణలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సుదీప్తో సేన్. ఇక ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు. 

దేశవ్యాప్తంగా రిలీజ్ విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఏర్పడ్డాయి. అలాగే సినిమాని ఆపాలని కోర్టు ద్వారా ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో చిత్ర యూనిట్ హైకోర్టుకు వెళ్లి సినిమా ఆపకుండా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇక మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ అయినా ఈ చిత్రం తమిళనాడు మల్టిప్లెక్స్ లలో మాత్రం బ్యాన్ ని ఎదుర్కొంది. ఈ రోజు(ఆదివారం) నుంచి తమిళయనాడు మల్టిప్లెక్స్ అశోషియేషన్ వారు ఈ సినిమాని బాయ్ కాట్ చేసారు. తమిళనాడు మీడియా ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. లా అండ్ ఆర్డర్ సమస్యలు రావటం, పబ్లిక్ నుంచి సరైన ఆదరణ దక్కకపోవటంతో సినిమాని వద్దనుకున్నట్లు తెలియచేసారు.

మరో ప్రక్క రిలీజ్ కు ముందే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ సినిమా సమాజంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేసేందుకు ఆలోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ ఓ జర్నలిస్టు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ‘ది కేరళ స్టోరి’ మూవీ తమిళనాట బాయ్ కాట్ చేయటం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాలో అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బాలని, సిద్ధి ఇదాని ముఖ్య పాత్రల్లో నటించారు. 

Scroll to load tweet…

అలాగే కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మహిళలు ఇస్లాంలోకి మార్చబడ్డారని, ఇందులో కొంతమంది ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితం అయ్యారని, ఐసిస్ పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కొందరు ఐసిస్ పోరాటానికి మద్దతుగా సిరియా వెళ్లిన ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సినిమాను తప్పుపట్టారు. 32 వేల మంది మతం మారినట్లు రుజువు చేస్తే రూ.1 కోటి ఇస్తామని ముస్లిం సంస్థ ఛాలెంజ్ చేసింది. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ .. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు.