రీసెంట్ గా బీస్ట్ నిరాశపరచడంతో.. ఆశలన్నీ తెలుగు సినిమాపైనే పెట్టుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. ఇక విజయ్ తెలుగు సినిమాలో హీరో తండ్రిగా తమిళ స్టార్ హరో నటిస్తున్నాడట..? 


రీసెంట్ గా బీస్ట్ నిరాశపరచడంతో.. ఆశలన్నీ తెలుగు సినిమాపైనే పెట్టుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. ఇక విజయ్ తెలుగు సినిమాలో హీరో తండ్రిగా తమిళ స్టార్ హరో నటిస్తున్నాడట..? 

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ తో చేస్తోన్న ప న్ ఇండియా మూవీ నుంచి భారీ అప్ డేట్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. విజ‌య్ 66వ సినిమాగా వ‌స్తున్న ఈ ప్రాజెక్టును దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈసినిమాలో హీరో విజ‌య్‌కు తండ్రిగా తమిళ స్టార్ యాక్ట‌ర్ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన స్టార్ యాక్ట‌ర్ శ‌ర‌త్ కుమార ఈ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్ నడుస్తోండ‌గా..దీనిపై అఫీషియ‌ల్ అప్‌డేట్ రావాల్సి ఉంది. 

ఈ మూవీకి వంశీ పైడిప‌ల్లి, హ‌రి, అహిషోర్ సోలోమ‌న్ క‌థ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు ఇచ్చిన ఎస్ థ‌మ‌న్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తునారు. భారీ బ‌డ్జెట్ సోష‌ల్ డ్రామా నేప‌థ్యంలో రాబోతున్న ఈ సినిమాలో క‌న్న‌డ భామ ర‌ష్మిక మందన్నా ఫీ మేల్‌లీడ్ రోల్ చేస్తోంది. 

ఇక ఊపిరి సినిమా త‌ర్వాత ఓ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ చేయడం అదికూడా వంశీ పైడిప‌ల్లి తెలుగు, త‌మిళ భాష‌ల్లో చేస్తున్న చిత్ర‌మిదే కావ‌డం విశేషం. ఇక ఈ ఇద్ద‌రి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా సందడి చేయబోతోందో అని ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈసినిమాతో తెలుగు ఎంట్రీతో పాటు, ప్యాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు విజయ్.