ఈసారి ఆస్కార్ వేడుకలు మన ఇండియన్స్ కు ప్రత్యేకం కాబోతున్నాయి. ఎప్పుడూ ఆస్కార్ పై పెద్దగా దృష్టి పెట్టని మన వాళ్ళు.. ఈ సారి ఆస్కార్ ను లైవ్ చూసేందుకు రెడీ అవుతున్నారు. ఇక మన ఇండియన్ యాక్టర్స్ ఆస్కార్ కోసం తమ ఓటును వినియోగించుకుంటున్నారు. 

ఇంకా మూడు రోజుల్లో ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈసారి అకాడమీ అవార్డ్స్ ను ఇండియన్స్ ఇంట్రెస్ట్ గా చూడబోతున్నారు. దానికి కారణం కూడా అందరికి తెలిసిందే. ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యి ఉంది. దాదాపు ఆస్కార్ కన్ ఫార్మ్ అంటున్నారు కూడా. అంతే కాదు ఆస్కార్ వేదికమీద మన తెలుగు వారి పెర్ఫామెన్స్ లు కూడా ఉన్నాయి అని సిగ్నల్స్ రావడంతో.. లైవ్ చూసేందుకు అంతా రెడీ అవుతున్నారు. ఇక ఇది అలా ఉంచితే.. ఇప్పటికే జ్యూరీలో సభ్యులుగా ఉన్న మన ఇండియన్ స్టార్స్ తమ ఓటును వినియోగిచుకుంటున్నారు. 

 మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుండగా, తాజాగా ఈ అవార్డుల కోసం జ్యూరీ మెంబర్స్ ఓటింగ్ చేస్తున్నారు. ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య.. తన ఓటు వేసినట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.దీంతో సూర్య తన ఓటును ఎవరికి వేశాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలవాలని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ ఆల్.. పాన్ ఇండియా ఆడియన్స్ కోరుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సాంగ్ కు ఆస్కార్ రావాలని ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు అభిమానులు. 

Scroll to load tweet…

మరో మూడు రోజుల్లో ఆస్కార్ సంగతి తేలబోతోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్ లను సాధించింది. ఆస్కార్ తరువాత అంతటి అవార్డ్ గోల్డెన్ గ్లోబ్ ను ఆర్ఆర్ఆర్ మూవీ సాధించింది. వాటితో పాటు.. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ నుంచి ఏకంగా 5 అవార్డ్ లను సాధించింది ఆర్ఆర్ఆర్. ఇక రాజమౌళి రెండు నెలల నుంచి అక్కడే ఉంటూ.. సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాదు అందుబాటులో ఉన్నప్పుడు స్పెషల్ స్క్రీనింగ్స్ వేస్తూ.. హాలీవుడ్ జనాలలో మన సినిమాను ఎక్కించేస్తున్నాడు.